మాస్​మహారాజా సరసన మలయాళ భామ

- Advertisement -

క్రాక్​ హిట్​ అయిన తర్వాత మాస్​ మహారాజా రవితేజ దూసుకుపోతున్నాడు. వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. లాక్​ డౌన్​ అనంతరం విడుదలైన క్రాక్​ .. మాస్​ జనాలను అలరించింది. దీంతో తనకు ఇంకా అగ్రహీరోల స్థాయిలో మార్కెట్ ఉందని మరోసారి రవితేజ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్​ కూడా పెంచినట్టు టాక్​. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ‘రామారావు ఆన్​ డ్యూటీ’ అనే ప్రాజెక్టుకు సైతం సైన్ చేశాడు. శరత్​ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సుధాకర్​ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మలయాళ భామ రాజీషా విజయన్‌ హీరోయిన్​గా ఎంపికైంది. ఇప్పటికే దివ్యాంశ కౌశిక్​ను కూడా ఒక హీరోయిన్ గా ఖరారు చేశారు. మొత్తానికి మాస్​ మహారాజాతో ఇద్దరు భామలు స్టెప్పులు వేయనున్నారన్నమాట. వాస్తవ ఘటనల ఆధారంగా సస్పెన్స్​ థ్రిల్లర్​గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం.

Also Read:చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

ఇక రమేశ్​ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్​ కూడా ఎంతో అలరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్​లో సస్పెన్స్​ థ్రిల్లర్స్​ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రవితేజ కొత్త దర్శకుడితో రామారావు ఆన్​ డ్యూటీ అనే సస్పెన్స్​ థ్రిల్లర్​కు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాస్​ మహారాజా కెరీర్​ మళ్లీ గాడిలో పడే చాన్స్​ ఉంది.

Also Read: తమన్ కి తమనే పోటీ..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -