Saturday, May 4, 2024
- Advertisement -

కొత్తగా పెళ్ళయిన వారికి కోసం!

- Advertisement -

ప్రస్తుతం వివాహవిచ్చేదనాల సంఖ్యా గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్తగా పెళ్ళయిన వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే మెదటి రాత్రిని గురించి ఎక్కువగా ఆపేక్షించటం కంటే అనగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం కంటే అంతకంటే ప్రాధాన్యం కలిగిన విషయాలు చాలా ఉన్నాయనే విషయం.

అన్ని ప్రశ్నలకు సమాధానాలు కలిగివుండటం చాలా కష్టం అయితే అలాంటి విషయాలకు సంభంధించినంతవరకు వ్యవహార జ్ఞానంతో మరియు తెలివితో వ్యవహరించటం కొత్త జంటలకు చాలా మంచిది మరియు శుభసూచకం. మీ మొదటి రాత్రి మరచిపోని మధుర రాత్రిగా మిగిలి పోవాలంటే మీరు వివాహానికి సంబంధించిన అన్నివిషయాలను గురించి అవగాహన కలిగి ఉండాలి.

* అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకోవటం. మొదటి రాత్రికి ముందుగా, కొత్తగా పెళ్ళయిన జంటలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కండోంను గురించి మరియు ఎన్ని రకాల గర్భనిరోధక మాత్రలు ఉన్నాయనే విషయం మరియు వాటివలన కలిగే అనుషంగ ప్రభావాలను గురించి కూడా తెలుసి ఉండాలి. మీకు వెంటనే పిల్లలను కనాలనిపిస్తే, మీరు మంచి ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమం. మంచి ఆహారం మీరు గర్భవతి అవటానికి అవకాశాలను మెరుగు పరుస్తుంది.

* పురుషులు తమ ఆర్ధిక విషయాలు, ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాలను గురింఛి తమ భార్యలకు తెలుపకుండా ఉండటం మంచిది కాదు. మీ వ్యాపారం బాగా జరుగకపోయినట్లయితే మీ భార్యకు వ్యాపారం గురించి తెలియకపోయినట్లయితే, ఆమె చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

మీరు అన్ని విషయాలు మీ భార్యతో చర్చించినట్లయితే మీకు ఆమె నుండి మంచి సలహా దొరకటమే కాకుండా, మీ వ్యాపారం బాగా లేకపోయినప్పుడు లేదా మీరు ఆర్థికంగా బాగా నష్టపోయినప్పుడు ఆమె అలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది.

* స్త్రీలు ముఖ్యంగా గుర్తుంచు కోవలసిన విషయం ఏమిటంటే, తమ భర్తలు పెళ్ళయిన తర్వాత తమపై చూపిన శ్రద్ధకు ప్రతిఫలంగా తాము కూడా వారిపై తగిన శ్రద్ధ చూపాలనే విషయం. ఇంతేకాకుండా స్త్రీలు ఇతర మగవారినుండి పొగడ్తలు మరియు ప్రశంసలు పొందే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ భర్త లేని సమయంలో ఎవరైనా తమను పొగిడితే లేదా ప్రశంసిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.  భార్యా భర్తలు ఇరువురు అలాంటి విషయాలకు అంటే పొగడ్తలకు మరియు ప్రశంసలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా వివాహ జీవితానికి ఎక్కువ విలువ ఇవ్వాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -