Sunday, May 19, 2024
- Advertisement -

బాహుబలి అక్కడ ప్లాప్ అయ్యింది!

- Advertisement -

ప్రభాస్ హీరోగా, రానా విలన్ గా తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ చిత్రం కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ లలోనే కాకుండా మిగతా భాషలలో కూడా భారీ వసూళ్ళ ఈ చిత్రం సాధించింది. ప్రస్తుతం బాహుబలి యూనిట్ బాహుబలి 2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఇంతకి బాహుబలి ప్లాప్ సంగతి ఏంటంటే? అన్ని భాషల్లో అదిరిపోయే రెంజ్ లో హిట్ అయిన ఈ సినిమాకి జర్మనీలో మాత్రం చుక్కెదురయ్యింది.

ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి జర్మనీ లో ఫ్లాప్ అయ్యింది. 30 స్క్రీన్ లలో రిలీజ్ కాగా వారాంతరంలో కేవలం 3.17 లక్షలు మాత్రమే వసూల్ చేసింది దాంతో భారీ రేట్ల కు కొన్న అక్కడి బయ్యర్ కు భారీ నష్టాలు తప్పేలా లేవు. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ళ సునామీ సృష్టించిన బాహుబలి జర్మనీ లో మాత్రం ఫ్లాప్ కావడం అందరినీ నిరాశ పరిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -