జియోకి దిమ్మ తిరిగే షాక్ తగిలేలా.. ఎయిర్ టెల్ సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ను అంబానీ కూడా ఊహించి ఉండకుండా జియోకు షాక్ ఇచ్చింది. జియో ఫోన్ కంటే సూపర్ గా.. టచ్ స్క్రీన్ తోపాటు యూట్యూబ్, ఫేస్ బుక్ కూడా వాడుకునేలా ఎయిర్ టెల్ఆఫర్ ప్రకటించటం విశేషం.
దీనికి కార్బన్ A40 ఇండియాగా పేరు పెట్టారు. జియో కంటే 100 రూపాయలు తక్కువగా.. రూ.1399కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్లు తెలిపారు. కార్బన్ కంపెనీతో కలిసి పని చేస్తుంది. ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ తో పని చేస్తుంది. ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్ టచ్ స్క్రీన్. డ్యూయల్ సిమ్. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ కూడా పని చేస్తాయి. అన్ని పాపులర్ యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది ఎయిర్ టెల్. నెలకు రూ.169తో ప్యాకేజీతో డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. టూ సేమ్ జియో మాదిరిగానే ఎయిర్ టెల్ – కార్బన్ 4G స్మార్ట్ ఫోన్ డిపాజిట్ వసూలు చేస్తోంది. రూ.2వేల 899 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. అప్పుడే ఫోన్ ఇస్తారు.
మూడు సంవత్సరాలు (36నెలలు) తర్వాత ఫోన్ తిరిగి ఇస్తే డిపాజిట్ వస్తుంది. దీని కోసం ప్రతినెలా రూ.169 రీఛార్జ్ చేసుకోవాలి. 18 నెలల అనంతరం రూ.500 క్యాష్ రీఫండ్, 36 నెలల తర్వాత మరో రూ.1000 అంటే మొత్తంగా రూ.1500 ప్రయోజనాలు పొందవచ్చు. రీఛార్జ్ మొత్తాలను కూడా కలుపుకుంటే మొత్తంగా కార్బన్‌ఏ40 ఇండియన్ ధర 3,499 రూపాయలు.