Thursday, May 2, 2024
- Advertisement -

స్మార్ట్ పరీక్ష.. కేవలం 15 నిమిషాలు..!

- Advertisement -

స్మార్ట్​ఫోన్​ ఆధారంగా లాలాజలాన్ని పరీక్షించి కొవిడ్​-19 ఉనికిని నిర్ధరించే సరికొత్త పరీక్ష విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగశాలతో పనిలేకుండా, కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫలితాన్ని వెల్లడిస్తుండటం విశేషం. ‘టులానె యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​ మెడిసిన్’​ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ‘సైన్స్​ అడ్వాన్సెస్’ పత్రిక అందించింది.

పరిశోధకులు స్మార్ట్​ఫోన్​కు ఫ్లోరోసైన్స్​ మైక్రోస్కోప్​ను అనుసంధానించారు. ఇందుకు వారు ‘సీఆర్​ఐఎస్​పీఆర్​/కాస్​ 12ఎ మాలిక్యూల్​ ఎస్సే చిప్’​ను వినియోగించారు. లాలాజల నమూనాల్లో వైరస్​ తీవ్రతను ఈ మైక్రోస్కోప్​ అత్యంత నిశితంగా పరిశీలిస్తుంది. కాగా, ఈ విధానంలో మొత్తం 12 మంది కొవిడ్​ బాధితులకు, ఆరుగురు ఆరోగ్యవంతులకు పరీక్షలు నిర్వహించగా.. సరిగ్గా ఆర్టీ-పీసీఆర్​ విధానంలో మాదిరే ఫలితాలు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -