Sunday, April 28, 2024
- Advertisement -

అక్కినేని హీరోల మ్యూజిక్ మ్యాజిక్

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీకి మ్యూజిక్ అంటే భలే ఇష్టం .అక్కినేని హీరోలంతా తమదైన శైలిలో మ్యూజిక్ ను రక రకాలుగా వాడేసుకుంటూ ఉంటారు.దాంతో మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అక్కినేని హీరోలతో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇపుడు ఆ ఇంట్రెస్ట్ కాస్త… మరింతగా పెరిగినట్లుంది. అందుకే ఇద్దరికీ ఇద్దరే అనే కాన్సెప్ట్ తాజాగా లైమ్ లైట్లోకొచ్చింది.

అక్కినేని హీరోలకు ముందునుంచి మాంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది.అందుకే వారు చేసే సినిమాల్లో మ్యూజిక్ ‘కీ’ రోల్ పోషిస్తూ ఉంటుంది. ఎఎన్ఆర్ కూడా ఆ రోజుల్లో తన సినిమాల్లో మ్యూజిక్ కు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలా ఇచ్చి సంగీతంతో సహవాసం చేశారు.అదే ఫార్ములాను ఆ తరువాత రోజుల్లో ఈయన కుమారుడు నాగార్జున కూడా కంటిన్యూ చేశాడు.నాగ్ సినిమాల్లో కథ,కథనం అయినా ఫెయిల్ అవుతుందేమో గాని మ్యూజిక్ మాత్రం అస్సలు ఫెయిల్ కాదు.

నాగార్జున పద్దతిని ఇప్పటితరం ఆయన వారసులైన…. చైతు ,అఖిల్ లు కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నాగ్ కుమారులిద్దరూ ఓ అడుగు ముందుకేశారు. తన తండ్రి లా కాకుండా తమ సినిమాలకు ఇద్దరేసి మ్యూజిక్ డైరెక్టర్లను సెలక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఒక్కరితో చేస్తే వచ్చే కరెక్ట్ అవుట్ పుట్ కేవలం రెండు ,మూడు సాంగులకే పరిమితమౌతుందని వారు భావిస్తున్నారు. అందుకే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటే మిగతా మూడు సాంగ్స్ కూడా భాగుంటాయని వారు భావించినట్లుంది. ఆల్రెడీ ఈ విషయంలో అఖిల్ ముందడుగు వేసాడు. తన డెబ్యూ చిత్రానికి గాను మనోడు అనూప్ ,తమన్ లతో హడావిడి చేశాడు. 

 అఖిల్  ఇలా చేశాడో లేదో…. ఇపుడు అదే రూట్లోకి చైతు కూడా వచ్చి చేరిపోయాడు. మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్ కోసం మనోడు మాలీవుడ్ బ్యాచ్ లో ఓ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తన సినిమాకోసం రిక్రూట్ చేసుకున్నాడట.ప్రేమమ్ ఒరిజినల్ వెర్షన్ కి మ్యూజిక్ అందించిన రాజేష్ మురుగేషన్ తో పాటు గోపిసుందర్ లు ప్రేమమ్ రీమేక్ కు వినసొంపైనా బాణీలను అందించబోతున్నారు.ఈ సినిమాని నవంబర్ 30వ తేదీన లాంచ్ చేసి, డిసెంబర్ మొదటి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అఖిల్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసొచ్చినట్లు ఇపుడు చైతుకు కూడా కలిసొస్తారనే అనుకుందాం.ఏది ఏమైనా అక్కినేని హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లను వాడుకున్నంత భాగా ఇంకా ఎవ్వరూ వాడుకోలేరేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -