Monday, May 13, 2024
- Advertisement -

మోడీ ప్రభుత్వం మీద ఫుల్ ఫైర్ ఐన కెసిఆర్

- Advertisement -

వరంగల్ ఉప ఎన్నిక నేపధ్యం లో ప్రచార కార్యక్రమాల్లో కెసిఆర్ తనదైన శైలి లో దూసుకుని పోతున్నారు. కెసిఆర్ భాగస్వామ్యం లో ప్రచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. నెమ్మదిగా వోటింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడం తో ఆయన తన దూకుడు పెంచారు.

తన మీద ఇన్నాళ్ళూ విమర్శలు చేస్తున్నవారి మీద ఒకసారిగా విరుచుకు పడ్డారు కెసిఆర్. దాదాపు నలభై ఐదు నిమిషాలు కేవలం విమర్సకులకి సమాధానాలు చెప్పడం కోసమే కేటాయించిన కెసిఆర్  కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీ.. నిరసనకారులు.. మీడియా.. ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు. కాకుంటే.. అందరి కంటే ఎక్కువగా విమర్శలు పడ్డవి బీజేపీకి.. ఆ పార్టీ నేత కిషన్ రెడ్డికే.  

కాంగ్రెస్ – టీడీపీ లని తిట్టినపుడు కొందరు నేతల్ని ప్రస్తావించిన కెసిఆర్ బీజేపీ విషయంలో మాత్రం హైదరాబాద్ లోని తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో పాటు డిల్లీ లోని బీజేపీ సర్కారు మీదా ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తారు . అధికారం లోకి వచ్చినపుడే బీజేపీ కూడా అధికారం చేపట్టింది అని కానీ 16 నెలల్లో తాము చేసిన కార్యక్రమాల్లో కనీసం ఒక్కశాతం కూడా బీజేపీ చేయలేకపోయింది అని చెప్పారు కెసిఆర్.

సమస్యల పరిష్కారం మీద ఆ మధ్య కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. సమస్యల పరిష్కరానికి కేంద్ర సర్కారు దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదన్నారని.. కేంద్రం దగ్గర లేని అద్భుత దీపం తెలంగాణరాష్ట్రం వద్ద ఎలా ఉంటుందని  ప్రశ్నించటం విశేషం. అప్పట్లో తెలంగాణా కోసం అందరూ రాజీనామా చేసిన కిషన్ రెడ్డి మాత్రం చెయ్యకపోవడాన్ని ఆయన గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు.

విమర్శకుల మీద సీరియస్ అవడం కెసిఆర్ కి కొత్తేమీ కాదు కానీ వరంగల్ సభలో మాత్రం బీజేపీ కి స్పెషల్ స్పీచ్ ఇచ్చారు కెసిఆర్. కేంద్రం చేసిన ఒక్క మంచి పనైనా చూపిస్తే వారికి జై కొడతాను అన్నారు కెసిఆర్ దీని బట్టీ చూస్తే కేంద్రంపై తనకున్న అసంతృప్తిని కేసీఆర్ బాహాటంగానే వ్యక్తం చేశారని చెప్పాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -