సిరియా అంత‌ర్ యుద్ధంలో మ‌ర‌ణాన్ని జ‌యించిన బుడుత‌

Aleppo kid Omran Daqneesh.. young face of Aleppo suffering

ప్ర‌కృతి ఎంత విచిత్ర‌మైన‌దో మాన‌వులు క‌నుక్కోలేరు.మ‌రనం అంచుల‌కు వెల్లిన‌వారు ..మ‌ళ్లీ బ్ర‌తుకుతున్న సంఘ‌ట‌న‌లు మ‌నం అక్క‌డ‌క్క‌డ చూస్తున్నాం.కాలం కూడా మాన‌వుని జీవితంత‌లో ఎన్నోమార్పులు తీసుకొస్తుందంటారు.ఏదైనా అనుకోని ప్ర‌మాదం సంభ‌వించిన‌పుడు కాలం మాత్రం మ‌రో జీవితాన్ని ప్ర‌సాదిస్తుంది.అందుకు నిద‌ర్వ‌న‌మే ఈ బుడుత‌డు సాక్షి.

ఈపోటోలో క‌నిపిస్తున్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా…! అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచాడు ఓ చిన్నారి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బాలుడే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రులతో ఆడుకుంటున్న ఈ చిన్నారిని గుర్తించారా…. అయితే ఒక్కసారి గుర్తు చేసుకోండి…
ఈ బాలుడు మరెవరో కాదు.. సిరియా అంతర్యుద్ధంలో నలిగిపోతున్న బాల్యానికి అప్పట్లో సాక్ష్యంగా నిలిచిన బుజ్జాయే ఈ చిన్నారి. ఆంబులెన్స్‌లో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఒమ్రాన్‌ ఫొటో ….అప్పట్లో యావత్‌ ప్రపంచాన్నే కదిలించింది. చిన్నారి ఒమ్రాన్ ఇప్పుడు ఆరోగ్యంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు.

{loadmodule mod_custom,GA1}

ఆ వీడియోను పిల్లవాడి తండ్రి సామాజిక మాధ్యమంలో పెట్టారు. ప్రస్తుతం వాళ్లు అలెప్పోలో ఉంటున్నారు. అయితే రెబల్స్‌ నుంచి రక్షించడానికి ఒమ్రాన్‌ జుట్టు కట్‌ చేయడంతోపాటు…. అతని పేరును కూడా మార్చారు. ఆ పేరును మాత్రం తండ్రి చెప్పలేదు. ఒమ్రాన్‌ సిరియా ఐకాన్‌గా మారిపోయిన నేపథ్యంలో.. అతని కుటుంబానికి ప్రధాని రక్షణ దళాలు భద్రత కల్పిస్తున్నాయి.చూశారుగా ప్ర‌కృతి ఎంత‌విచిత్ర‌మైన‌దో..

{loadmodule mod_sp_social,Follow Us}