Tuesday, May 7, 2024
- Advertisement -

ఆదాయం మూరెడు… బాబు ఖ‌ర్చు బారెడు… చివ‌ర‌కు మిగిలేది అప్పులే….

- Advertisement -

ఆదాయం మూరెడు ….ఖ‌ర్చులు బారెడు ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రిస్థితి . బాబు చేసె ఖ‌ర్చుల‌కు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్ప‌టికె పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మ‌రింత దివాలా తీసెందుకు బాబు వెనుకాడ‌టంలేదు. రాబ‌డి త‌క్కువ‌గా వ‌స్తోంద‌ని ఖ‌ర్చులు త‌గ్గించుకోవాల‌ని ఒక వైపు ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మొత్తుకుంటుంటె బాబు మాత్రం ప్ర‌జ‌ల సొమ్మును సొంత అవ‌స‌రాల‌కు వాడుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

నేనే రాజు…. నేనే మంత్రి అంతా నాయిష్టం అంటూ నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేక ఆర్థిక శాఖ సంక‌నాకుతుంటె త‌న సొంత ఖ‌ర్చుల‌కు మాత్రం ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతున్నాడు.రైతులకు రుణ‌మాఫీ కాకా దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో ఉంటె ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్టైనా లేదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిధులు వెచ్చించాలంటె ఖ‌జానా కాలీగా ఉంద‌ని చెబుతూ …స్వప్రయోజనాలకు మాత్రం యధేచ్ఛగా ఖర్చుపెడుతున్నారు.

తాజాగా బాబు స్వంత ప్ర‌యోజ‌నాల‌కోసం ప్ర‌జ‌ల సొమ్మును ఆయ‌న సొంత ఇంటి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కోసం రూ.7.50 ల‌క్ష‌లు మంజూరు చేస్తూ జీవోను విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.65లో ఇటీవలే నిర్మించిన ఇంట్లో, నీటి సరఫరా, శానిటరీ పనులతో పాటు, మదీనాగూడలోని సొంత ఫాంహౌస్‌కు భద్రత, నిర్వహణకు ఈ నిధులను మం‍జూరు చేసారు.

సాధార‌నంగా ప్ర‌భుత్వానికి సంబంధించిన అథిగృహాలు లేక క్యాంపు కార్య‌ల‌యాల‌కు ఖ‌ర్చు చేస్తె అది వేరే విష‌యం. కాని సొంత ఇళ్ళకు కూడా ప్రజల సొమ్మును ఖర్చు చేయటమేంటో? హైదరాబాద్ లో ఇళ్ళు కాకుండా కృష్ణానది కరకట్టపై చంద్రబాబుకు క్యాంపు ఆఫీసుంది. మళ్ళీ విజయవాడలో ఇంకో క్యాంపు కార్యాలయముంది. అన్నింటికీ ప్రభుత్వ ఖర్చే. ఇలా ఖర్చులు చేసుకుంటూ పోతే అప్పులు, తిప్ప‌లు త‌ప్ప ఇంకేమి మిగులుతుంది. ఎవ‌రు ప్ర‌శ్నించినా అదొక్క‌టి అడ‌క్కు అంతే … ఎంతైనా నీతి,నిప్పు, నిజాయితీ ముఖ్య‌మంత్రిక‌దా….? అయినా ఒక ముఖ్య మంత్రికి ఇన్ని క్యాంపు కార్యాల‌యాలా..?

ప‌ది సంవ‌త్స‌రాల‌పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఇక్క‌డి నుంచె ప‌రిపాల‌న సాగించ‌వ‌చ్చు. కాని ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌టంతో కేసీఆర్ దెబ్బ‌కి హైద‌రాబాద్‌లో జెండా పీకి వ‌దిలి విజ‌య‌వాడ‌లో పాతారు. ఏమ‌న్నంటె ప‌రిపాల‌నోసం స‌వ్యంగా సాగ‌డంకోసం నిర్ణ‌యం తీసుకున్నామ‌ని క‌వ‌ర్ చేస్తారు. ఇప్ప‌టికైనా బాబు త‌న దుబారా ఖ‌ర్చులు త‌గ్గించుకోక‌పోతె బొచ్చ ప‌ట్టుకొని కేంద్రం ద‌గ్గ‌ర అడుక్కోవ‌డం త‌ప్పా ఏమి ఉండ‌దు.

AP CM Chandrababu Naidu Released Rs 75-lakhs for Sanitary Works Residence
AP CM Chandrababu Naidu Released Rs 75-lakhs for Sanitary Works Residence

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -