- Advertisement -

ఏలియన్ ను మొత్తానికి పట్టేశారు

- Advertisement -

గ్రహాంతర వాసులపై గతంలో చాలా సందర్భాలలో చాలా రకాల పోస్టులు ఫొటోలు వచ్చాయి. వాటిలో ఏది నిజమో ఎవ్వరికీ తెలియకపోయిన రూపం విషయంలో మాత్రం చాలామంది చాలా ఆకృతులను సృష్టించారు. కాని మెజారిటీ జనాలు సృష్టించినవే ఇప్పటికే ఎక్కడో చోట ఫొటోల రూపంలో ఏలియన్స్ కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఫొటోనే ఒకటి… కాదు కాదు వీడియో ఒకటి బయటకు వచ్చింది .

ఈ వీడియో లో గాయపడిన ఏలియన్‌ను… స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. విషయంలోకి పోతే.. 1947లో అమెరికా, మెక్సికోలోని రోస్‌ వెల్‌ ప్రాంతానికి సమీపంలోని ఏరియా 51 ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వలన ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా అప్పట్లో వెల్లడించింది.కాని అసలు విషయాలు ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతుంది.

చాలామంది చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఫ్లైయింగ్ సాసర్ పేలిపోయిందనే నమ్మాల్సి వస్తుంటుంది. ఆ పేలింది… ఏలియన్‌‌ల అంతరిక్ష నౌక అంటున్నారు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ నాటి వీడియో ఒకటి ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ టైమ్లో దొరికిన ఏలియన్ ను యూఎస్ బలగాలు స్ట్రెచర్‌పై స్వయంగా తరలించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. కాని ఈ వీడియో ను చూస్తుంటే ఇది కావాలని తీసిన వీడియోగా కలరింగ్ ఇస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -