Tuesday, May 21, 2024
- Advertisement -

చెప్పులు పోతే… కంప్లంటై తీసుకున్న పోలీసులు

- Advertisement -

పోలీసులనేవారు ఏవిషయాన్ని పడితే ఆ విషయాన్ని కేసుగా స్వీకరించరు. అది ఎలాంటి ఇష్యూ అయినప్పటికీ.. ముందుగా జస్ట్ మాటలతో సముదాయించి కేసు కాకుండానే ఎక్కడైనా చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో జిడి ఎంట్రీ చేసి ఆతరువాత స్టెప్ వేస్తుంటారు. కాని అదేంటో పుణే పోలీసులు మరీ టూ మచ్ గా బిహేవ్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రోల్ అవుతుంది.

ఫుణేలోని ఖేద్‌ మండలం రక్షవేది గ్రామావాసి విశాల్ కలేకర్… ఈనెల అక్టోబర్‌ 3న తన చెప్పులు పోయాయంటూ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందరితో చెప్పినట్లుగానే పోలీసులతో నేను నా ఇంటి బయట విడిచిన చెప్పులను ఎవరో ఎత్తుకెళ్లారు సార్ అంటూ ఆ కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అది కూడా సరిగా ఉదయం 3 నుంచి 8 గంటల మధ్యలోనే ఈ చోరి జరిగి ఉంటుందని ఆయన సందేహించాడు. దాంతో పోలీసులు నవ్వి ఊరుకోకుండా.. ఏకంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్‌ జాదవ్‌ అతనితో చెప్పారు.

ఆ టైమ్లో అంతా అతనేదే కామెడీకి అలా అన్నాడనుకున్నారు. కాని జాదవ్ సీరియస్ గానే చెప్పులు చోరిని హ్యాండిల్ చేశాడు. కొందరు ఈ గొడవను ఎందుకు కంప్లైంట్ గా ఫైళ్ చేసారని ఎవరో అడిగితే … ఇలాంటి ఫిర్యాదులెప్పుడూ తన వద్దకు రాలేదని.. ఇదే ఫస్ట్ టైమ్ అంటూ చెప్పారు. దొంగలెవరో గుర్తించటం కష్టతరంగా మారిందన్న ఆయన సెక్షన్‌ 379 కింద కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఉన్నతాది కారులకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసు ఎప్పుడు పరిష్కరించ బడుతుందో తెలియదు గాని మొత్తానికి 425 రూపాయల విలువైన చెప్పులను చోరీ చేసిన కేసులో బాధితుడి ఆక్రందనను ఖేద్‌ పోలీసులు ఎంతో బాగా అర్థం చేసుకున్నారంటూ ఓవైపు.. పోలీసులు చేస్తోంది తప్పేం కాదంటూ మరోవైపు … సోషల్‌ మీడియాలో పలువురు పలు రకాలుగా పోస్ట్ లు చేస్తూ అందరిలో ఈ విషయంపై ఓ ఆలోచన వచ్చేలా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -