Thursday, May 16, 2024
- Advertisement -

BSNL న్యూ ఆఫర్.. కేవలం 97కే అన్ లిమిటెడ్ డేటా

- Advertisement -

బీఎస్‍ఎన్‍ఎల్.. ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జియో ఇస్తున్న ఆఫర్స్ కి ఎదురు దాడి చేసేందుకు.. టెలికం కంపెనీలు రకరకల ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు అదే క్రమంలో బీఎస్‍ఎన్‍ఎల్ కూడా సరికొత్త ఆఫర్స్ ను తీసుకొస్తుంది. మెక్రోమ్యాక్స్ కంపెనీతో కలిసి 4G ఓల్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.

కేవలం ఈ ఫోన్ రూ.2,200తో ధరకే లభించనుంది. అక్టోబర్ 20వ తేదీ నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. భారత్ వన్ పేరుతో లాంఛ్ చేస్తోంది. 97 రూపాయలకే అన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్ సౌకర్యం ఇస్తుంది. భారత్ 1 ఫీచర్స్ కూడా బాగున్నాయి. 4G ఓల్ట్ ఫోన్. న్యూమరికల్ కీ ప్యాడ్. 2.4 ఇంచ్ స్క్రీన్. క్వాల్ కామ్ 205 ప్రాససర్. 512 MB ర్యామ్. 2 మెగా ఫిక్సల్ కెమెరా. VGA సెల్ఫీ కెమెరా. 2000mAH బ్యాటరీ భారత్ 1 ఫోన్ 22 భారతీయ భాషలను సపోర్ట్ చేయటం విశేషం.

అలానే మైక్రోమ్యాక్స్ ఎంటర్ టైన్ మెంట్ యాప్ ఇందులో ఇన్ బిల్ట్ ఇచ్చారు. లైవ్ టీవీ, మ్యూజిక్, మూవీస్, వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ఉంది. డిజిటల్ పేమెంట్స్ కోసం UPI యాప్ ఉంది. మెక్రోమ్యాక్స్ తో ఒప్పందంలో భాగంగా బీఎస్‍ఎన్‍ఎల్ రూ.97 ఆఫర్ ఇస్తోంది. అన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. అన్ లాక్ సిమ్. ఏ నెట్ వర్క్ సిమ్ అయిన ఈ ఫోన్ లో ఉపయోగించుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -