Monday, April 29, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ టార్గేట్ బాబు గారేనా..?

- Advertisement -

వర్మ లొల్లి షురూ చేశాడు. ఈసారి ఏకంగా బాబునే ఫీల్డ్ లోకి తీసుకు వచ్చేశాడు. కావాలంటే ఈ పిక్ చూడండి. ఇదంతా ఎన్టీఆర్ ఆత్మ నిత్యం తన కలలోకి వస్తుంది కాబట్టి ఈ పిక్ ను పోస్ట్ చేశాడో ఏమో. దీనికి తోడు అన్నగారు స్క్రిప్ట్ సహకారం కూడా ఇస్తున్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు రాం గోపాల్ వర్మ.

లేటెస్ట్ గా తన ఫేస్ బుక్ లో ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీ పార్వతి విలపిస్తున్న దృశ్యాన్ని, అక్కడే చంద్రబాబు ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అలాగే మరో ఫోటోలో ఎన్టీఆర్..లక్ష్మీ పార్వతి మెడలో పూల దండ వేయడాన్ని…. మళ్ళీ అక్కడా చంద్రబాబు ఉన్న దృశ్యాన్ని మరింత హైలైట్ చేశాడు.

ఈ విధంగా వర్మ ఎప్పటికప్పుడు ఈ చిత్రంపై తాను తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. ఇక ఈ ఫిలిం కోసం వర్మ అందరూ కొత్త నటీనటులనే తీసుకొంటున్నాడని, ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ రోల్ వేసే కొత్త యాక్టర్ కి నిర్విరామంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని కూడా తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -