Sunday, May 5, 2024
- Advertisement -

జేడీ లక్ష్మీనారాయణతో బాబు స్కెచ్ ఇది….. వ్యూహాన్ని బయటపెట్టిన నేషనల్ మీడియా

- Advertisement -

టిడిపికి పవన్ కళ్యాణ్ దూరమవుతాడని చంద్రబాబు ఎప్పుడు ఊహించాడు? ఆ మరుక్షణమే చంద్రబాబు పన్నిన వ్యూహాలేంటి? అసలు తన మనుషులను గూఢచారులుగా పెట్టి ప్రజారాజ్యం పార్టీని సర్వనాశనం చేసినట్టుగానే జనసేన విషయంలోనూ చంద్రబాబు చేసింది ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు నాయకులు, మీడియా జనాల మధ్య చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తన మనుషుల ద్వారా పవన్ వ్యూహాలను పసిగట్టిన చంద్రబాబు ఆ వెంటనే పవన్‌ వ్యక్తిత్వాన్ని చంపేసేలా పచ్చ మీడియా చేత విష ప్రచారం చేయించాడు. మహేష్ కత్తిలాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని పవన్ ఇమేజ్‌ని పూర్తిగా డ్యామేజ్ చేశాడు. ఇక అజ్ఙాతవాసి సినిమాను కూడా పూర్తిగా చంపేశారు.

ఇవన్నీ తెరముందు కనిపిస్తున్నవి అయితే తెరవెనుక మాత్రం పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికే చెందిన జెడి లక్ష్మీనారాయణతో టచ్‌లోకి వెళ్ళాడు చంద్రబాబు. పవన్‌కి వ్యతిరేకంగా తన అస్త్రాన్ని తయారు చేసుకున్నాడు. నిజానికి 2014 ఎన్నికల్లోనే టిడిపి తరపున పోటీచేయాలని లక్ష్మీనారాయణ భావించాడని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే తన కాలంలో రాసుకొచ్చాడు. అయితే అలా చేస్తే జగన్‌పై కక్ష్య కట్టి కేసులు నడిపించిన వైనం ఇంకా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందని…….అది మొత్తంగా టిడిపినే ముంచే అవకాశం ఉందని బాబు వారించాడు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం పవన్‌కి వ్యతిరేకంగా…అలాగే జగన్ అవినీతి అంశాన్ని మరోసారి ట్రంప్ కార్డ్‌లా ఉపయోగించుకునేలా లక్ష్మీనారాయణ చేత రంగప్రవేశం చేయిస్తున్నాడు చంద్రబాబు. ఇవే విషయాలను జాతీయ పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సవివరంగా రాసుకొచ్చింది. రంగస్థలం వెనకాల జరిగిన చంద్రబాబు-లక్ష్మీ నారాయణల కథకమామీషును పూర్తిగా చెప్పుకొచ్చింది. 2014ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలతో పాటు, మోడీ ఇచ్చిన హామీల విషయంలో కూడా పూర్తిగా విఫలమై….అత్యంత విఫల ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన చంద్రబాబును 2019 ఎన్నికల్లో ఇలాంటి కుట్ర వ్యూహాలు కాపాడతాయా? రంగస్థలంపై ప్రదర్శించబోయే చంద్రబాబు అండ్ బ్యాచ్ నాటకం తెరపై ఇంకా పూర్తిగా ఆవిష్కరించబడాలంటే మాత్రం ఎన్నికల టైం ఇంకా దగ్గర పడాల్సిందే. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ, అశోక్ బాబు…ఇక ఇప్పుడు జేడీఎస్ లక్ష్మీనారాయణలాంటి బాబు బ్యాచ్ అంతా కూడా బాబు కోసం ఎన్నికల సమయంలోనే యాక్టివ్ అవుతారు మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -