Monday, May 20, 2024
- Advertisement -

ఆ బ్యాడ్ సెంటిమెంట్ బలపడుతుందేమో అని భయపడుతున్న బాబు

- Advertisement -

ఎవ్వరికీ భయపడను అని తరచుగా చెప్పుకుంటూ ఉంటాడు కానీ నిజానికి దేశంలో ఉన్న అందరి పొలిటీషియన్స్ కంటే చంద్రబాబుకే భయాలు ఎక్కువ అని స్పష్టంగానే అర్థమవుతూ ఉంటుంది. తాను పైకి ఎక్కి వచ్చిన దారి అలాంటిది మరి. అందుకే ఎవ్వరినీ నమ్మలేడు. ప్రతి విషయానికి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి ఓ భయం చంద్రబాబును వెన్నాడుతోంది. మామూలుగానే చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కామన్ అని తెలుగు ప్రజలకు ఓ సెంటిమెంట్ ఉంది. ఆ విషయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి బాగా హైలైట్ చేశాడు. చంద్రబాబు దురదృష్టమో ఏమో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం తీవ్ర స్థాయిలో కరువు తాండవించిన మాట మాత్రం వాస్తవం.

ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ప్రకృతి ప్రకోపాలు కూడా బాబు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇక షరా మామూలుగానే కరువు విలయ తాండవం చేస్తోంది. ఇక అన్నింటికీ మంచి బాబుగారి ఈ టెర్మ్‌లో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలపై మాత్రం హిందూ ధర్మకర్తలు చంద్రబాబు బ్యాడ్ సెంటిమెంట్ గురించి చాలా వ్యాఖ్యలే చేస్తున్నారు. పుష్కరాల సమయంలో మూడు పదుల సంఖ్యలో భక్తులు చనిపోవడం, విజయవాడలో దేవాలయాలను పడగొట్టించడం….. నారా లోకేష్ కోసం దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేశారన్న ప్రచారం…… వీటన్నింటికీ తోడు ఇప్పుడు తాజాగా ఒంటిమిట్ల దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రకృతి విలయతాండవం చేయడం హిందూ పండితుల్లో చాలా ప్రశ్నలనే రేకెత్తిస్తోంది. చంద్రబాబు దంపతులు రామయ్యకు తలంబ్రాలు తీసుకొస్తున్న వేల ప్రకృతి విలయతాండవం చేయడం…….. నలుగురు భక్తులు చనిపోవడం……. యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడడం…… వందల సంఖ్యలో భక్తులు గాయపడ్డారన్న వార్తలు చాలా ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడిదే చంద్రబాబును భయపెడుతోంది. 2019ఎన్నికల సమయంలో హిందూ యాంటీ సెంటిమెంట్ ఎక్కడ బలపడుతుందో అన్న భయం బాబును వెన్నాడుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో సిఎం హోదాలో బూటు కాళ్ళతో పూజలు చేయడంలాంటివి చేశాడు చంద్రబాబు. ఇప్పటి పరిణామాలను విశ్లేషిస్తూ హిందూ పండితులు చంద్రబాబు చుట్టూ బ్యాడ్ సెంటిమెంట్ అల్లేస్తూ ఉన్నారు. ఈ సెంటిమెంట్‌ని హిందువులు నమ్మారంటే మాత్రం 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -