Tuesday, May 21, 2024
- Advertisement -

వావ్.. గాల్లోకి ఎగిరి ఎల్గర్‌ అద్భుత క్యాచ్ ….

- Advertisement -

టెస్టు క్రికెట్‌ లో అరుదైన అద్భుత క్యాచ్ ను సఫారీ ఆటగాడు డీన్ ఎల్గర్ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిప‌ట్టాడు. ఇప్పుడు సోషియ‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి.. పూర్తిగా గాల్లోకి ఎగిరి అతను క్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల్ని సంభ్రమంలో ముంచెత్తింది.

తొలి ఇన్నింగ్స్ లో ఆతిధ్య ప్రోటీస్ 488 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ కు దిగన ఆసీస్‌ వడివడిగా వికెట్లు కోల్పోయింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ల స్థానంలో వచ్చిన ఆటగాళ్లు సఫారీలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో జట్టు భారాన్ని కెప్టెన్‌ టిమ్‌ ఫైన్‌, పాట్‌ కమిన్స్‌ మోసే ప్రయత్నం చేశారు.

207 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా తాత్కాలిక కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ మొండిపట్టుదలతో క్రీజ్‌ అంటిపెట్టుకొని ఉండి ప్రతిఘటించాడు. బొటనవేలికి అయిన గాయం సలుపుతున్నా.. పైన్‌ చెలరేగి ఆడాడు. స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన పైన్‌.. అనంతరం కగిసో రబడా బౌలింగ్‌లోనూ ఒక ఫోర్‌ మీద దూకుడు మీద కనిపించాడు. కానీ, రబడా ఓవర్ చివరి బంతిని పైన్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

పైన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడా వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. దీనిని ఆపేందుకు పరుగెత్తిన ఎల్గర్ మెరుపు వేగంతో అమాంతం గాల్లోకి లేచి బంతిని ఒడిసిపట్టాడు. దీంతో 221 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. బంతిని ఆపుతాడని కూడా ఊహించని బంతిని క్యాచ్ పట్టేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -