Wednesday, May 15, 2024
- Advertisement -

అబద్ధాల్లో బాబుకు గిన్నిస్ రికార్డ్ ఖాయం…….. అతిపెద్ద అబద్ధం ఆడేసిన బాబు

- Advertisement -

అబద్ధాలు ఆడడంలో చంద్రబాబుకు గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలా? ఈ ఆర్టికల్ చదివాక అబద్ధాలు చెప్పడంలో కూడా గిన్నీస్ రికార్డ్ లాంటిది ఏదైనా ఉంటే అందుకు చంద్రబాబు అర్హుడో కాదో మీరే చెప్పండి. ఇంతకుమించిన అబద్ధం ఇంకెవరైనా చెప్పగలరేమో కూడా చెప్పండి. వైఎస్‌కి టిక్కెట్ ఇవ్వమని ఇందిరాగాంధీకి చెప్పింది నేనే అన్నాడు బాబు. కానీ వైఎస్సార్ ఇందిరా కాంగ్రెస్‌లో చేరేనాటికి అసలు ఇందిరా కాంగ్రెస్‌లో లేడు చంద్రబాబు. ఎంచక్కా మామ పంచన చేరి ఉద్దరకు వచ్చిన మంత్రి పదవిని అనుభవిస్తూ ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్‌కి పార్టీ స్థాపించమని చెప్పింది తానేనని చెప్పాడు. కానీ ఎన్టీఆర్ పార్టీ స్థాపించే నాటికి ఇందిరా కాంగ్రెస్‌లో ఉన్న బాబు…….ఏకంగా ఎన్టీఆర్‌పైనే పోటీ చేసి ఎన్టీఆర్‌ని ఓడిస్తానని తొడగొట్టాడు. ఓటుకు కోట్లు నుంచి తన అవినీతి, వైఫల్యాల విషయంలో ఎన్నో అబద్ధాలు చెప్పాడు.

కానీ నిన్న తిరుపతిలో చెప్పిన అబద్ధం మాత్రం అంతకుమించి. ఇంకా చెప్పాలంటే అన్నింటికీ మించి. ప్రపచంలోనే ది బెస్ట్ అబద్ధాల రాయుడుగా చంద్రబాబుకు ఎందుకు గిన్నీస్ రికార్డ్ ఇవ్వకూడదు అని తెలుగు ప్రజలతో పాటు తెలుగు తమ్ముళ్ళు కూడా డిమాండ్ చేసే స్థాయి అబద్ధం చెప్పేశాడు. టిడిపి పోరాటం గొప్పల గురించి, తన పోరాట చరిత్ర గురించి చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు……..అదే ఫ్లోలో ఏకంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఘనత టిడిపికి, తనకు దక్కుతుందన్న రేంజ్‌లో చెప్పుకుపోయాడు. వేదికపైన ఉన్న టిడిపి నాయకులు కూడా షాక్ తిన్న పరిస్థితి. ఇక టివిల ముందు, వేదిక ముందు కూర్చున్న జనాలకయితే నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అబద్ధాలు ఆడే నాయకుడిగా గిన్నీస్ రికార్డ్ కొట్టేయాలన్న ప్రయత్నం అయితే గొప్పగా చేస్తున్నాడు చంద్రబాబు. కాకపోతే ఆ అబద్ధాలను భరించాల్సిన ప్రజలను తల్చుకుంటేనే ఆవేదన కలగడం ఖాయం. పాలకుడన్నవాడు పదిమందికీ ఆదర్శంగా ఉండాలంటారు. ఈ స్థాయి అబద్ధాలతో …..ఎపిలోనే ది బెస్ట్ అబద్ధాల కోరుగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారు ఎపి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆయనే చెప్పాలి. లేకపోతే ఆయన భజన మీడియా బృందం అయినా వాళ్ళ కామెంట్స్‌లో వివరణ ఇస్తారేమో చూడాలి. మాదర్‌చోద్ అన్న పదం అత్యంత పునీతం అని సమర్థించినట్టుగానే వచ్చే వీకెండ్ కామెంట్‌లో చంద్రబాబు అబద్ధాలు లోక కళ్యాణార్థం అని జ్యోతి రాధాకృష్ణ ఏమైనా చెప్తాడేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -