Thursday, May 23, 2024
- Advertisement -

నారా లోకేష్ – శేఖర్‌రెడ్డి……… అడ్డంగా ఆర్బీఐకి దొరికిపోయారా?

- Advertisement -

నరేంద్రమోడీ ఎక్కడ తన తప్పులను తవ్వితీస్తాడో……సిబిఐ కేసులు, అరెస్టులు, జైలు జీవితం ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతున్నాడు చంద్రబాబు. అందుకే తనపై కక్ష్య సాధిస్తారని చెప్పి ముందుగానే డ్రామా మొదలెట్టాడు బాబు. నరేంద్ర మోడీ విషయంలో తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురవుతున్న బాబు తనకు అండగా ప్రజలు నిలబడాలే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన తప్పులపై విచారణ జరపాల్సి వస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న సందేశాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా మోడీకి చేరేలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు బాబు.

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బాబు కంటే ముందు నారా లోకేష్ బుక్కయ్యేలా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నోట్ల కోరత నేపథ్యంలో…….కొత్త నోట్ల ముద్రణ నాటి నుంచీ కూడా ఎన్ని వేల కోట్ల కొత్త రెండు వేల నోట్ల కట్టలు పంపించినా కూడా అన్నీ బ్లాక్ మార్కెట్‌కి తరలుతున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో విశ్లేషణ నేపథ్యంలో ఆర్బీఐ రంగంలోకి దిగింది. నోట్ల రద్దుకు ముందు నుంచీ ఇప్పటి వరకూ జరిగిన భారీ నగదు చెల్లింపుల వ్యవహారాలపై తనిఖీ చెపట్టింది. ఇప్పుడు ఇదే విషయం టిడిపి నాయకుల్లో టెన్షన్ పుట్టిస్తోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తమిళనాడులో వేల కోట్ల కొత్త నోట్లతో దొరికిపోయిన శేఖరరెడ్డికి కొత్త నోట్లు వెళ్లాయన్నది నిజం. ఆ తరలింపు వెనకాల నారా లోకేష్ ఉన్నాడని ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్‌తో సహా చాలా మంది విశ్లేషకులు కూడా లోకేష్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆర్బీఐ కనుక ఆంధ్రప్రదేశ్‌లో నోట్ల రద్దు నుంచీ ఇప్పటి వరకూ చోటు చేసుకున్న అన్ని భారీ నగదు ట్రాన్సాక్షన్స్‌ని విశ్లేషిస్తే మాత్రం శేఖరరెడ్డికి వేల కోట్ల రూపాయలు కొత్త నోట్లు పంపించిన వాళ్ళు అడ్డంగా దొరికిపోవడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. సాక్ష్యాలున్నాయా? ఎక్కడ అని ప్రశ్నించిన లోకేష్ తప్పు చేసి ఉంటే ఆర్బీఐ విచారణలో దొరికిపోవడం ఖాయమని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -