Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ నిజాయితీ చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావులకు తెలిసొచ్చిందా?

- Advertisement -

వైఎస్ జగన్ అవినీతికి పాల్పడలేదు. వైఎస్ జగన్ దగ్గర అవినీతి సొమ్ములేదు అని చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావులు ఒప్పుకోవడం జరిగేపనేనా? కానీ జరిగింది. జగన్ దగ్గర అవినీతి సొమ్ములేదు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళది. అందుకే ఒప్పేసుకున్నారు. అంతకుమించి చేయగలిగింది మాత్రం ఏముంది? అందుకే దానికి సంబంధించిన ప్రశ్నలను అవాయిడ్ చేశారు. ప్రస్తావించడానికి కూడా ముందుకు రావడం లేదు.

ఇంతకూ అసలు విషయం ఏంటంటే………..పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశ పెట్టిన సందర్భం గుర్తుందా? మోడీ మాట్లాడిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు……… మోడీ సూపర్……… నోట్ల రద్దు నిర్ణయం సూపర్ అన్నాడు. ఆ నిర్ణయానికి కారణం నేనే అన్నాడు. షరా మామూలుగా పచ్చ మీడియా మొత్తం మోడీని ఆకాశానికెత్తేసింది. అదే సందర్భంలో వైఎస్ జగన్‌పై నిందలు కూడా వేసింది. నోట్ల రద్దు నిర్ణయం వెలుడిన సందర్భంలో తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్య సమస్యతో మీడియా ముందుకు రాలేకపోయాడు జగన్. అదే అవకాశంగా తీసుకుని అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తూ జగన్ అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా రాజకీయ అవకాశవాదం చూపించారు. నోట్ల రద్దు దెబ్బతో జగన్ అవినీతి సొమ్ము నష్టపోవడంతో షాక్‌లో ఉన్నాడని హేళన చేశారు…….. ఎగతాళిగా మాట్లాడారు.

ఇప్పుడు అదే చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావులతో పాటు పచ్చ బ్యాచ్ మొత్తం కూడా నోట్ల రద్దుతో అవినీతి సొమ్ము రూపాయి కూడా బయటపడలేదని చెప్తున్నారు. అంటే ఆ రోజు జగన్ విషయంలో బాబు, లోకేష్‌లతో సహా పచ్చ బ్యాచ్ మాటలన్నీ అబద్ధాలేనా? లేక జగన్ దగ్గర అవినీతి సొమ్ములేదనా? అబద్ధాలతో రాజకీయం చేస్తూ ఉంటాం అన్న నిజంతో పాటు జగన్ దగ్గర అవినీతి సొమ్ములేదు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు అండ్ కో లేరా? అందుకే తాజాగా ఈ విషయంపై ఒక విలేఖరి సంధించిన ప్రశ్నకు సమాధానం దాటవేశాడు చంద్రబాబు. పైగా నోట్ల రద్దు చెత్త నిర్ణయం అంటూ మరోసారి తన అబద్ధాల వైఖరిని బయటపెట్టుకున్నాడు చంద్రబాబు. అన్ని విషయాలన్నీ అబద్ధాలతో రాజకీయం చేసే నాయకులు, మీడియా వ్యవస్థలను నమ్మాలా? లేదా అన్న ప్రశ్న మాత్రం ఇప్పుడు ఎపి ప్రజల ముందు ఉంది. మరోసారి అబద్ధపు మాటలకు, అసత్య ప్రచారాలకు మోసపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక ఎప్పటికీ విలువలతో కూడిన రాజకీయాలు చూడలేము అన్న ఆందోళనను విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం చంద్రబాబు, ఆయన భజన మీడియా రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -