Thursday, May 9, 2024
- Advertisement -

న్యూస్ ఛాన‌ల్ల‌లో ఇప్ప‌టి నుంచి ఆ ప‌దం వాడ‌కూడ‌దు…I&B మంత్రిత్వ శాఖ

- Advertisement -

న్యూస్ ఛాన‌ల్స్‌ల‌ల్లో ద‌ళితులు అనే ప‌దాన్ని ఇప్ప‌టి నుంచి వాడ‌కూద‌ని కేంద్ర స‌మాచారా, ప్ర‌చార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దళితులు అనే పదం స్థానంలో షెడ్యూల్డ్ కులాలు అనే పదం వాడాలని ప్రైవేటు చానళ్లకు రాసిన లేఖలో కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ సూచించింది. దళితులు అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లీషులో షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కానీ లేదా జాతీయ భాషల్లో దానికి సరిపడు మరో పదాన్ని కానీ ఉపయోగించాలని తెలిపింది.

ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్‌ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది.

సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్‌ అనే పదం వాడకూడదనే పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఈ మేరకు జూన్‌లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్‌ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్‌ జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -