Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తోనే గేమ్సా? ఆ ప్రొడ్యూసర్‌కి చుక్కలు కనిపిస్తున్నాయ్…

- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సైజ్ ఆర్టిస్ట్….. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పేంత సీన్ కూడా లేదు…. కమెడియన్‌‌గా కూడా పట్టుమని పది సినిమాల్లో రాణించింది లేదు. అయితేనేం ఆయనగారి భజనే నచ్చిందో…. లేక ఎవడో సొమ్ముకు బినామీ కాబట్టి అప్పనంగా తెచ్చిన కోట్లు నచ్చాయో తెలియదు కానీ ఒక స్టార్ హీరోగారు ఆ కమెడియన్‌ని కాస్తా స్టార్ ప్రొడ్యూసర్‌ని చేసి పడేశారు. తన గురించి ఆ కమెడియన్ కనీవినీ ఎరుగని స్థాయి భజన చేస్తాడు కాబట్టి ఆ స్టార్ హీరో కూడా ఆ కమెడియన్ గురించి నాలుగు పెద్ద మాటలే మాట్లాడాడు. నిండుగా జీవం ఉంటుందని, సినిమా కోసం ప్రాణాలిచ్చేస్తాడని, నిజాయితీపరుడని…… అబ్బో ఏదేదో మాట్లాడేసి సింహాసనం మీద కూర్చోపెట్టాడు.

ఆ క్రేజ్‌తో క్రేజీ డైరెక్టర్స్‌ని పట్టుకున్న అతగాడు ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే ఎంత సింహాసనం మీద కూర్చున్నా అసలు బుద్ధులు అయితే పోవు కదా……యంగ్ టైగర్ ముందు కూడా అవే బుద్ధులు చూపించాడు. ఒక సినిమా విషయంలో చూసీ చూడనట్టుగా వదిలేసిన ఎన్టీఆర్……ఆ తర్వాత చేసిన సినిమా విషయంలో మాత్రం సెట్‌లో అడుగు కూడా పెట్టనివ్వద్దని డైరెక్టర్‌కి చెప్పేశాడు. ఆ రకంగా ఒక్క రోజు కూడా సెట్‌లో అడుగుపెట్టే అవకాశం లేకుండా భారీ సినిమాకు నిర్మాతననిపించుకున్నాడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మాత్రం ఎన్టీఆర్ ముందే కుప్పిగంతులు వేశాడు. ఆ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు ఒక రేంజ్‌లో లెఫ్ట్ అండ్ రైట్ వాయించడంతో దెబ్బకు దారికొచ్చాడు. అంతటితో వదిలేసి ఉన్నా కాస్త పరువు మిగిలేది. కానీ మీడియా ముందుకు వచ్చి, టివి స్టూడియోలలో కూర్చుని …..తానో పెద్ద సెలబ్రిటీనని ఫీలయి ఇష్టం వచ్చినట్టుగా వాగేశాడు. ఆ వాగుడు దెబ్బతో ఇండస్ట్రీలోనే స్థానం లేకుండా పోయింది. ఇండస్ట్రీలో చిన్నా పెద్దా అంతా కూడా ఛీ కొట్టారు. ఆ తర్వాత కూడా మనవాడు మీడియా ముందుకు వచ్చి ట్రంప్‌తో మాట్లాడతా, హైదరాబాద్‌లో నేనో పెద్ద తోపు అని చాలానే చెప్పాడు. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఇండస్ట్రీ జనాలు మాత్రం ఈ స్థాయి కామెడీ సినిమాల్లో చేసి ఉంటే స్టార్ కమెడియన్‌గా సెటిల్ అయిపోయి ఉండేవాడు కదా అని సానుభూతి చూపించారు. ఆ తర్వాత కూడా తన భజనను, అలాగే మొత్తం ఇండస్ట్రీలోనే భజనను బాగా ఇష్టపడే తన హీరో దగ్గరకు వెళ్ళి వ్యాపార ఒప్పందాలను బాగానే కుదుర్చుకున్నాడు.

అయితే ఈ భజన పరుడి వ్యక్తిత్వం ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయిందని…… ఇలాంటి భజన బ్యాచ్‌తో తిరిగితే ‘నిజాయితీపరుడు’ అని కొన్నేళ్ళుగా గొప్ప ప్రచార తెలివితేటలతో తెచ్చుకున్న ఇమేజ్ మొత్తం గంగలో కలిసిపోతుందని ఆ స్టార్ హీరోకి సన్నిహితులు హెచ్చరించడంతో ఆ స్టార్ హీరో కూడా ఈ సారి వెనుకడుగేశాడన్నది ఇండస్ట్రీ టాక్. ఇంతలో ఎన్టీఆర్ సినిమా రైటర్‌కి డబ్బులు ఎగ్గొట్టిన కేసులో కోర్టు కాస్తా లక్షల్లో జరిమానా, జైలు శిక్ష కూడా విధించడంతో దెబ్బ మీద దెబ్బ…..మరో దెబ్బ అన్నట్టుగా తయారయ్యింది మనవాడి పరిస్థితి. మొత్తంగా ఇతగాడి పరిస్థితిని చూస్తున్నవాళ్ళు మాత్రం నిజాయితీ అంటే మాటల్లో కాదమ్మా……చేతల్లో, జీవన విధానంలో ఉండాలి…..గొప్పగా మాటలు చెప్పి…బ్రహ్మాండంగా భజన చేసి ఎవరైనా కొంత కాలం బాగానే గడిపెయ్యొచ్చేమో కానీ ఆ తర్వాత మాత్రం ఇలానే ఉంటుంది పరిస్థితి. మనవాడు తీసిన సినిమా టైంలో ఎన్టీఆర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు వరుస హిట్స్ తర్వాత ఎక్కడున్నాడు? అప్పట్లో ఒక్క హిట్‌కి రెచ్చిపోయిన వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడెక్కడున్నాడు?

ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. కానీ ఎత్తులో ఉన్నప్పుడు మరికాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకానీ ఈ కమెడియన్ కం ప్రొడ్యూసర్‌లా రెచ్చిపోతే మాత్రం చివరికి పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈ గుణపాఠాన్ని చూసిన తర్వాత అయినా ఒక్క హిట్టుకి ఎగిరెగిరి పడే జనాలు పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందనేలాంటి తెలుగు సామెతలు కూడా గుర్తుంచుకోవాలి. అలాగే నటనలో, నాట్యంలోనూ అద్వితీయ ప్రతిభావంతుడైన ఎన్టీఆర్ హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పుడూ టాప్ రేంజ్‌లో ఉంటాడన్న సత్యం కూడా తెలుసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -