Monday, May 20, 2024
- Advertisement -

ఈ ఐదేళ్లలో బాబు ‘లోకం చుట్టిన వీరుడు’ అవుతాడా..?!

- Advertisement -

తెలుగుదేశం అధినేత మరో విదేశీ పర్యటనకు సిద్ధం అవుతున్నాడు. ఒకటి కాదు.. త్వరలో ఆయన వరసగా పలు దేశాల్లో పర్యటనకు రెడీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా టర్కీతో ఈ సారి విదేశీ యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి.

తెలుగుదేశం అధినేత తన కుటుంబాన్ని తీసుకొని ఆ దేశంలో పర్యటించబోతున్నాడు. ఇది పూర్తిగా వ్యక్తిగత యాత్ర అనుకోవాలి. ఈ యాత్రలో చంద్రబాబు మనవడు కూడా విదేశీ పర్యటన చేయబోతున్నాడని తెలుస్తోంది.

మరి ఇది కుటుంబయాత్ర అనుకొంటే.. ఆ వెంటనే తెలుగుదేశం అధినేత ఆస్ట్రేలియా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ దేశంలో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి.. అలాగే పెట్టుబడి దారులకు ఆహ్వానం పలకనున్నాడట తెలుగుదేశం అధినేత. మరి ఇప్పటికే ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించాడు చంద్రబాబు. జపాన్ , సింగపూర్ వంటి దేశాల్లో పర్యటించాడు. జపాన్ కు అయితే రెండు సార్లు వెళ్లి వచ్చాడు. బాబు మాత్రమే కాదు.. ఆయన ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్నవారు కూడా వరసగా ఏదో ఒక విదేశం వెళుతూనే ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో బాబు తాజాగా మరో విదేశీ పర్యటనకు తెరలేపారు. ఈ సారి ఆస్ట్రేలియాను ఎంచుకొన్నారు. మరి ఎవరు ఏం అనుకొన్నా.. తగ్గేది లేదన్నట్టుగా బాబు ఇలా విదేశీ బాట పడుతూనే ఉన్నారు. మరి ఈ తీరుతో ఆయన రాబోయే ఐదేళ్లలో లోకం చుట్టిన వీరుడిగా పేరు తెచ్చుకొంటాడేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -