Friday, May 17, 2024
- Advertisement -

ఆ సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యామిలీకి మంటెక్కిందా..?!

- Advertisement -

మొన్నటి వరకూ టాలీవుడ్ లో రికార్డులు అన్నీ మెగా ఫ్యామిలీ పేరు మీదే ఉండేవి. ముందుగా కలెక్షన్ల విషయంలో ‘మగధీర’ సినిమా రికార్డులు సృష్టించింది. రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందిన ఆ సినిమా టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది.

కోట్ల రూపాయల వసూళ్లతో సంచలనంగా మారింది. అయితే ‘మగధీర’ రికార్డులను ‘అత్తారింటికి దారేదీ’ చెరిపేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రికార్డుల్లో కొత్త సంచలనం సృష్టించింది.

టాలీవుడ్ లో టాప్ మోస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో రాంచరణ్ సినిమా రికార్డులు చెరిగిపోయాయి. అయినా కూడా ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఆనందమే. ఎందుకంటే. . వాళ్ల కుటుంబానికే చెందిన హీరో పేరుమీదనే రికార్డులు నిలబడ్డాయి. కాబట్టి.. అయితే ఇప్పుడు ఆ రికార్డులు చెరిగిపోయాయి! ఇప్పుడు అన్ని రికార్డూలూ ‘బాహుబలి’ సినిమకి సొంతం అయ్యాయి. తెలుగు గడ్డపై భారీ స్థాయి కలెక్షన్లను సాధించిన సినిమాగా.. వివిధ భాషల్లోకి డబ్ అయ్యి.. అక్కడ కూడా కోట్ల రూపాయలను సాదించింది ‘బాహుబలి’

ఈ విధంగా తమ పేరిట ఉన్న రికార్డులు కాస్తా బాహుబలి సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీకి బాగా మంటెక్కి ఉందని.. ఎలాగైనా త్వరలోనే రికార్డులను తిరగి తమ పేరు మీద కు బదిలీ చేసకోవాలని  ఆ కుటుంబం భావిస్తోందని టాక్: మరి ఈ విషయంలో ఆ కుటుంబం ఆశలన్నీ రాబోతున్న రాంచరణ్ సినిమా, షూటింగ్ ప్రారంభం అయిన ‘సర్దార్’ ల మీదనే ఉంది. మరి ఆ కుటుంబం మంటను వీటిలో ఏ సినిమా చల్లారుస్తుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -