Tuesday, May 6, 2025
- Advertisement -

హెల్మెట్ ధరించటం వలన తలపై చర్మం దెబ్బ తింటాయి!

- Advertisement -

* కొన్ని సంవత్సరాల నుండి వెంట్రుకలను బిగుతుగా కట్టి ఉంచుకునే శైలిని అనుసరించే వ్యక్తులలో ఈ ట్రాక్షన్ అరోమతా సమస్యను స్పష్టంగా పరిశీలించవచ్చు. అదే విధంగా అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా హెల్మెట్ ధరించే వ్యక్తులలో ఈ సమస్యను గమనించవచ్చు.

* మీరు  హెల్మెట్ ను ధరించినప్పుడు వచ్చే చెమట, మురికి మరియు ఆహార  సూక్ష్మకణాలు, గాలి కారణంగా బ్యాక్టీరియా ప్రజననకు హెల్మెట్ పునాదిగా మారుతుంది. నూతనంగా వచ్చే శిరోజాల పెరుగుదలపై ఇది కూడా ప్రభావం చూపుతుంది.

* మీరు ప్రయత్నించాల్సిన ఉత్తమ మరియు సులభమైన విషయం- ప్రతి రోజు హెల్మెట్ ను యాంటి బ్యాక్టీరియా ద్రవంతో శుభ్రపర్చడం. మీరు ఎల్లప్పుడూ హెల్మెట్ ను శుభ్రపరిచినన తర్వాత పూర్తి పొడిగా మారి బ్యాక్టీరియా తొలిగిపోయిందా! లేదా అని చూడాలి. ఈ విధంగా చేయడం వలన మీ తల పై చర్మాన్ని లేదా జుట్టును సంరక్షించుకోవచ్చు.

* తలపై గల రక్తనాళాలతో జుట్టు కుదుళ్ళు ఎక్కువ కాలం పాటు సంబంధం కలిగి ఉండవు కనుక శిరోజాల నష్టాన్ని నిరోధించడం కష్టంగా మారుస్తుంది. కానీ తలపై గల రక్తనాళాలలోని రక్తప్రసరణను వృద్ది చెందించే పద్దతులు పాటించడం వలన వెంట్రుకల నష్టాన్ని అదుపు చేయవచ్చు. తల యొక్క ఉపరితలంపై రక్తప్రసరణను అభివృద్ధి పర్చడం వలన ట్రాక్షన్ ఆరోమతా ద్వారా మీరు కోల్పోయిన శిరోజాలను తిరిగి పొందడానికి అధిక అవకాశాలు కలవు. తలపై రుద్దడం వలన చర్మ స్థితిస్థాపకతను పెంచవచ్చు మరియు శిరోజాల కుదుళ్ళకు రక్తప్రసరణ మెరుగుపరచడానికి అనేక రకాలైన మంచి పోషక ఆహారపదార్థాలు మరియు మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే హెల్మెట్ ధరించినపుడు కలిగే సమస్యల నుండి శిరోజాలను దూరంగా ఉంచడానికి తరచుగా శిరోజాలను నీటితో శుభ్రపరచుకోవాలి. కాబట్టి మీరు వాహనాలను నడుపుతున్నపుడు ఎల్లపుడు హెల్మెట్ ను ధరించడం మంచిది కానీ అది సరైన పద్దతిలో ధరించడం అనేది కూడా అతి ముఖ్యమైన విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -