Saturday, April 20, 2024
- Advertisement -

అందాన్ని మెరుగు పరిచే పండు..

- Advertisement -

బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి సహాయ పడుతుంది. దీనిలో ఉన్న విటమిన్లు నిర్జీవమైన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం ఏర్పడేందుకు దోహద పడుతాయి. బొప్పాయికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉండటంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

ఆరోగ్యానికే కాక సౌందర్య పోషణలోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి వంటి పళ్లతో ముఖానికి మాస్క్ వేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోయి చర్మం తేటగా మారుతుంది. అర స్పూన్ ముల్తాన మట్టికి టీ స్పూన్ బొప్పాయి గుజ్జును కలిపి ముఖంపై పూసి బాగా మసాజ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

ఇలా చేస్తే ముఖం కాంతివంతగా తయారవుతుంది. కొంత మందికి చర్మం గరుకుగా ఉంటుంది. ఇటువంటి వారి చర్మాన్ని కూడా మృదువుగా మార్చ గల గుణం బొప్పాయిలో ఉంది. బొప్పాయి తొక్కను తీసి ఓ గిన్నెలో వేసి ఉడికించి దానిని మెత్తగా నూరి ముఖానికి రాసి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి.

Also Read: నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -