Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగు భాషను ఉద్ధరించే ఉద్యమం…..అడ్డంగా బుక్కయిన ఈనాడు… తెలుగు తల్లికి ఘోర అవమానం

- Advertisement -

ఈనాడు చేసే ప్రజాపోరాటాలన్నింటిలోనూ ఏ స్థాయి స్వార్థం ఉంటుందో ఇప్పటికే చాలా మంది మేధావులు చెప్పారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నట్టు ఉంటుంది ఈనాడు వ్యవహారం. ఇక ఈనాడు ఏదైనా ప్రత్యేక ఉద్యమానికి తెరతీసింది అంటే దాని వెనుక ఉండే రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాల గురించి ఇప్పటికే ఎంతోమంది చెప్పారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈనాడు చేపట్టిన సారాయి వ్యతిరేక ఉద్యమమే. ఆ ఉద్యమం దెబ్బకు ఉధయం లాంటి గొప్ప పత్రిక మూతబడిపోయింది. ఆ ఉద్యమం పుణ్యమాని ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాడు. అలాగే తనకు పోటాపోటీగా ఉన్న ఉదయం పత్రిక మూతపడేలా చేయడంలో సక్సెస్ అయింది ఈనాడు. నిజాయితీగా ప్రజల కోసం పనిచేసిన ఉదయం పత్రిక ప్రస్థానం అలా రాజకీయ కుట్రలకు బలైపోయింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి పాలనలో ఒక ఉద్యమంలాగా మద్యంపై ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఆ లెక్కలను సర్కారు వారే ఘనంగా ప్రకటిస్తున్నారు. పల్లె ప్రజలు సారాకు వ్యతిరేకంగా రకరకాల పోరాటాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా చంద్రబాబుకు ఘాటుగా లేఖలు రాస్తున్నాయి. కానీ ఈనాడుకు మాత్రం అవేవీ కనిపించవు. ఇప్పుడు మద్యంతో ముడిపడిన వ్యపారాలు వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా తెలుగు మహాసభలను నెత్తికెత్తుకున్న ఈనాడు పేజీలకు పేజీలు ప్రచురిస్తోంది. అలాగే కెసీఆర్‌తో సహా తెలంగాణా పాలకులను ఓ స్థాయిలో మోసేస్తోంది. ప్రజల సొమ్ముతో కోటాను కోట్ల రూపాయలతో మహా సభలు అంటూ ప్రభుత్వం హంగామా చేస్తోంది. నిజంగా సొంత ఖర్చులతో తెలుగు భాషకు సేవ చేయండి అంటే వాళ్ళలో ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. ఇక మడియాకు కూడా ఇలాంటి సందర్భాలలో భారీగా ప్రభుత్వం నుంచి ప్రకటనల రూపంలో అందుతుందని ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా పాలకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే తెలుగు భాషకు ఈ దుస్థితి ఎందుకు వస్తుంది?

ఆ విషయం పక్కన పెడితే మహాసభల సందర్భంగా ఈనాడు ప్రచురించిన ఒక కార్టూన్ మాత్రం ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలకు గురవుతోంది. ఈనాడు వారికి తెలుగు తల్లిని రాఘవేంద్రరావు హీరోయిన్‌లా చూడాలని ఎందుకు అనిపించిందో కానీ అచ్చం రాఘవేంద్ర రావు తన హీరోయిన్స్ అందాలను ప్రొజెక్ట్ చేసినట్టుగా చేస్తూ జుగుప్స కలిగించే ఒక కార్టూన్‌ని ప్రచురించారు. ఇప్పుడు ఈ కార్టూన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదేం దిగజారుడు జర్నలిజం అని నెటిజనులు విరుచుకుపడిపోతున్నారు. తెరపైన శృంగార సేవ, తెరవెనుక చంద్రబాబు సేవ చేయడంలో ప్రసిద్ధుడైన రాఘవేంద్రరావుని మహిమాన్వితుడైన డైరెక్టర్‌గా చూపించేందుకు ఈ మధ్య ఈనాడు మీడియా తెగ తాపత్రయ పడుతోంది. ఆ శృంగార రస వీరుడిని గొప్ప డైరెక్టర్‌గా ప్రొజెక్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఆ ప్రయత్నంలో ఈనాడుకు పూర్తిగా రాఘవేంద్రుడు పూనాడో ఏమో తలియదు కానీ తెలుగు తల్లిని రాఘవేంద్రరావు హీరోయిన్‌లాగా ప్రజెంట్ చేస్తూ కార్టూన్ ప్రచురించడం మాత్రం జుగుప్స కలిగిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -