విజయనగరం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీనుంచి మరో సినియర్‌నేత టీడీపీ ఖండువా కప్పుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. గతంలో కీలక ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కురుపాం మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది.
కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు కాకి గోవిందరెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండల టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రశేఖరరాజు తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మనసులోని మాటను బయటపెట్టారు.
దీంతో వైసీపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశేఖరరాజుకు పేరొంది. వైసీపీ స్థాపించిన తరువాత జిల్లాలో ప్రప్రఽథమంగా వైసీపీకి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రశేఖరరాజే. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయ ని విశ్లేషకులు భావిస్తున్నారు.
చంద్రశేఖర్ రాజు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయ్యిందని త్వరలోనే ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి ఆయన సమక్షంలో పసుపుకండువా కప్పు కుంటారని శుక్రవారం జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరినామం వైసీపీకీ పెద్ద ఎఫెక్టే అనుకోవచ్చు.
