Tuesday, May 14, 2024
- Advertisement -

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… బాబును హీరోగా చూపించడం కోసం రాధాకృష్ణ పాట్లు

- Advertisement -

నిజమైన హీరో అయితే అతని జీవితంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు, చేసిన పనులు అన్నీ నిజాయితీగా చెప్పొచ్చు. అలా చెప్పినప్పటికీ అతను హీరోగానే నిలబడతాడు. మరి విలనిజం పాళ్ళు ఎక్కువ ఉండే నాయకుడిని హీరో అని చెప్పి ప్రజలను నమ్మించాలంటే అబద్ధాలు చెప్పాలి. కంటి ముందు కనిపిస్తున్న నిజాలను కూడా మరోలా వక్రీకరించాలి. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ నుంచీ ఇప్పటి వరకూ పచ్చ బ్యాచ్ సిద్ధాంతం ఇదే. విజయాలన్నీ బాబుకు ఆపాదించడం…….వైఫల్యాల్లో కూడా బాబు హీరోయిజాన్ని చూపించాలని తాపత్రయపడడం……ఇదీ పచ్చ బ్యాచ్ ఫాలో అవుతున్న సిద్ధాంతం.

తెలుగు ప్రజల గొప్ప భవిష్యత్తు కోసం తపనపడిపోయిన చంద్రబాబు……తప్పనిసరి పరిస్థితుల్లో….‘నాకు సొంత బంధాలు, సొంత మనుషులకంటే కూడా ప్రజా ప్రయోజనాలే ముఖ్యం’ అని తలచి…..పిల్లనిచ్చిన మామ ప్రేమ దూరమైనా ఫర్వాలేదు….రాష్ట్రానికి మంచి జరగాలి అని గట్టి నిర్ణయం తీసుకుని ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన ధీశాలి చంద్రబాబు.

అదిరిపోయింది కదా. కుర్చీ కోసం స్వార్థంతో పిల్లనిచ్చిన మామకు కూడా వెన్నుపోటు పొడిచి…ఆ ఆవేదనతో ఆయన చనిపోవడానికి బాబు కారకుడయ్యాడు అని అందరూ విమర్శలు చేస్తుంటే రాధాకృష్ణ మాత్రం వెన్నుపోటు ఎపిసోడ్‌లో కూడా బాబు హీరోయిజం చూస్తూ ఉంటాడు. ప్రజలు కూడా ఆ హీరోయిజాన్నే నమ్మమంటారు. ఇక చంద్రబాబు తిప్పిన చక్రాలు, చంద్రబాబు రాజకీయ నాయకుడు కావడం ఒక్క తెలుగు ప్రజలకే కాకుండా….మొత్తం భారతదేశానికే ఎంత ప్రయోజనకరమో రసరమ్యమైన కథలతో వర్ణించే పనిలో ఆంధ్రజ్యోతి బిజీగా ఉంది. వార్తలన్నీ కూడా కథలే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే వాస్తవాలు వేరు……ఆంధ్రజ్యోతి వార్తలు వేరే కాబట్టి. ఇక చంద్రబాబు చాణక్యం, దేశంలో వచ్చిన అనేక రాజకీయ మార్పులు అన్నింటికీ చంద్రబాబే కారణం అనడం….ప్రజలందరూ కూడా చంద్రబాబు అంటే పడిచచ్చిపోతారు అనే స్థాయిలో కీర్తనలు అయితే ….‘దేవుడా…..ఆర్కే మార్క్ జర్నలిజం’ అని అనుకోవాల్సిందే. చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ రాధాకృష్ణ అహోరాత్రులు శ్రమించి అందిస్తున్న బాబు హీరోయిజం కథలు నారావారిని అయితే ఆనందడోలికల్లో ముంచే ఉంటాయి. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా ఆర్కేకు ముట్టే ఉంటుంది. ఈ ఆంధ్రజ్యోతి కాల్పనిక కథలు 2019 ఎన్నికల్లో బాబుకు ఏమేరకు సాయపడతాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -