Saturday, May 18, 2024
- Advertisement -

ఇది కూడా పండితుల స‌ల‌హానేనా….

- Advertisement -

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మొద‌ట అన్న‌వ‌స్తున్నాడు పేరుతో పాద‌యాత్ర చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితె పాద‌యాత్ర‌కు కోర్టు మిన‌హాయింపు ఇవ్వ‌క‌పోయినా పాద‌యాత్ర‌ను చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు. అన్నొస్తున్నాడు’ అనే పేరుతో చేపట్టాలని గతంలో అనుకున్నారు. కాని ఇప్పుడు అనూహ్యంగా పాదయాత్ర పేరును ‘ప్రజా సంకల్పం’గా మార్చారు.

ఇప్ప‌టికె రెండు సార్లు వాయిదాప‌డిన పాద‌యాత్ర‌ను ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో నవంబర్‌ 6 నుంచి ఆరు నెలలపాటు పాద‌యాత్ర చేయ‌నున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాలు, జరగని ప్రాంతాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని అనే అంశాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకూ కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌….ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. అలాగే మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టనున్నారు. గ‌తంలో పండితుల స‌ల‌హా మేర‌కు రెండు సార్లు పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకున్న జ‌ట‌న్ ఇప్పుడు కూడా వారి స‌ల‌హాతోనె పేరు మార్చారా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -