Saturday, April 20, 2024
- Advertisement -

గ్రేట్ ఆంధ్రకి జగన్ రెడ్డి మొండిచేయి..

- Advertisement -

జ‌గ‌న్‌రెడ్డి కోసం పుట్టిన గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్‌, అదే జ‌గ‌న్‌రెడ్డిపై వారం రోజులుగా వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. ప్యాకేజీ ప్రాబ్ల‌మా? ష‌ర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కోసం వ్యూహ‌మో తెలియ‌దు కానీ..క‌రెక్టుగా పచ్చ మీడియాలో ష‌ర్మిల పార్టీ పెడుతుంద‌ని ఎడిటోరియ‌ల్ వ‌చ్చిన నుంచీ గ్రేట్ ఆంధ్ర దిశ మారిపోయింది. వాస్త‌వంగా పచ్చ మీడియాలో రాసిన కొత్త ప‌లుకుని అంతా పులిహోర అని తేల్చేశారు.

అయితే గ్రేట్ ఆంద్ర‌లో మాత్రం జ‌గ‌న్‌రెడ్డి జైలుకెల్లినా వైసీపీని నిలబెట్టింది ష‌ర్మిల అంటూ స్పెష‌ల్ స్టోరీ వేయ‌డంతో పచ్చలో రాసింది పుకారు కాదు..జ‌గ‌న్‌రెడ్డి టీమ్ ప్లాంట్ చేయించిన స్టోరీలా అనిపించ‌డం ఆరంభ‌మైంది. జ‌గ‌న్‌రెడ్డి సొంత మీడియా సంస్థ సాక్షిపైనా వ్య‌తిరేక క‌థ‌నాలు గ్రేట్ ఆంధ్ర‌లో మొద‌ల‌య్యాయి. ఇసుక పాల‌సీపై సీఎంగా జ‌గ‌న్ విఫ‌లం అయ్యారంటూ మ‌రో స్టోరీ వేశారు. నిమ్మ‌గ‌డ్డ‌ని కెలికించి మ‌రీ కొట్టించుకున్న జ‌గ‌న్‌రెడ్డి అనే అర్థం వ‌చ్చేలా స‌మీక్ష ఒక‌టి వేసి, చుట్టూ కోట‌రీ వ‌ల్ల జ‌గ‌న్‌రెడ్డి న‌ష్ట‌పోతున్నార‌ని వీరంద‌రినీ అర్జంటుగా తీసేయాలంటూ మ‌రో స‌ల‌హాలాంటి స్టోరీని కుమ్మేశాడు. వారం రోజుల్లో గ్రేట్ఆంధ్ర వాడి ఆక్రోశం చూస్తుంటే..జ‌గ‌న్‌రెడ్డి త‌న సేవ‌లు మ‌రిచిపోయార‌ని, వాటిని గుర్తు చేయాలంటే ఇలా వ్య‌తిరేక క‌థ‌నాలు వేయ‌డ‌మే మార్గం అనుకున్నాడా? ‌లేదంటే జ‌గ‌న్‌రెడ్డిని ఫెయిల్యూర్‌గా చూపించి ష‌ర్మిల‌ని తెర‌మీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నాలా అనే కోణంలోనూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

మ‌రోవైపు జ‌గ‌న్‌రెడ్డి పార్టీ పెట్ట‌క‌ముందే గ్రేట్ ఆంధ్ర పెట్టి జ‌గ‌న్‌కి బాకా ఊదుతూ అంద‌రిపైనా త‌ప్పుడు వార్త‌లు రాసి కేసులు కూడా ఎదుర్కొన్నాడు గ్రేట్ ఆంధ్ర ఆరెక‌ట్ల వెంక‌ట‌రెడ్డి. అటువంటి గ్రేట్ఆంధ్ర వెంక‌ట‌రెడ్డి జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయిన‌వెంట‌నే ఏదో ఆశించి ఉండవచ్చు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చాడు ఐడ్రీమ్ చిన్నాల వాసుదేవ‌రెడ్డి. ఇప్ప‌టివ‌ర‌కూ న్యూట్ర‌ల్ ఉన్న ఐడ్రీమ్ మీడియా వాసుదేవ‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APDC) VC&MD పోస్టు క‌ట్ట‌బెట్టారు.

దీంతోపాటు ప్ర‌భుత్వం అన‌గా ఐఅండ్‌పీఆర్ లో 150 మంది ఉద్యోగులను వేసుకునే అవ‌కాశం, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల డిజిట‌ల్ ప్ర‌చారం సంబంధించి ప్రాజెక్టు కొట్టేశాడు ఐడ్రీమ్ వాసుదేవ‌రెడ్డి. ఇందులో ఎంతో కొంత ఐడ్రీమ్‌కి ప్ర‌తిఫ‌లంగా దక్కిఉండవచ్చు. ఇన్నాళ్లూ ఎదురుచూసిన వెంక‌ట‌రెడ్డి.. ఐడ్రీమ్‌ వాసుదేవ‌రెడ్డికి ద‌క్కిన పదవి, ప్రాజెక్టుతో హ‌ర్ట్ అయ్యాడ‌ని స‌మాచారం. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌రెడ్డి , భార‌తి టీమ్‌గా ఐడ్రీమ్ వుంటుంద‌ని, తాను ష‌ర్మిల టీమ్‌గా ఉంటే భారీ ప్ర‌తిఫ‌లం ద‌క్కే అవ‌కాశం వుంద‌ని అటు ప్లేటు ఫిరాయించాడ‌ని కొంద‌రు గ్రేట్ ఆంధ్రాకి ప‌నిచేస్తున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -