Sunday, April 28, 2024
- Advertisement -

కొత్తవారిని రాకుండా చేస్తోన్న హీరోల సెంటిమెంట్

- Advertisement -

ఒక్కో హీరోకి ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ కోసం వారు ఏమైనా చేసేస్తుంటారు. ఇది ఆ నాటి ఎన్టీఆర్ ఏఎన్ ఆర్ విషయంలో నిజమైంది. ఆతర్వాత చిరు,నాగార్జున మ్యాటర్లోను వర్కవుట్ అయింది. తర్వాత ఈ తరం వారిలో తారక్ ,మహేష్ ,మెగా కాంపౌండ్ విషయాల్లో నిజమవుతూ ఉంది.

ఈ ఉపోద్ఘాతమంతా సంగీత దర్శకులు, హీరోల కాంబినేషన్స్ గురించి. ఆ రోజులలో ఎన్టీఆర్ తన సొంత కాంపౌండ్ లో ఏ సినిమా చేసిన దానికి టావియస్ రాజు మ్యూజిక్ అందించేవారు. ఆతర్వాత రోజులలో అదే సెంటిమెంట్ చిరంజీవి షురూ చేశారు. చిరు బప్పీలహరి, ఇళయరాజా, రాజ్ కోటిలతో కంటిన్యూగా మూవీలు చేశారు. అయితే ఒక్కొక్కరి విషయంలో ఒకో సెంటిమెంట్ మెయిన్ టైన్ చేశారు.

ఇక నాగార్జున ,పవన్ లు రాజ్ కోటి, రమణగోగులను రెగ్యులర్ గా వాడేసి మమ అనిపించారు. ఇప్పుడేమో మహేష్ తారక్ మెగా కాంపౌండ్ లు దేవి శ్రీ ప్రసాద్ ను పట్టుకుని తెగ రుద్దేస్తున్నాయి.

ఈ సెంటిమెంట్ ఇతనిలో పస ఉన్నంత వరకు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాకపోతే.. ఈసెంటిమెంట్ కొత్తగా వచ్చే విషయమున్న మ్యూజిక్ డైరెక్టర్ల పాలిట శాపంగా పరిగణమించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -