Saturday, May 10, 2025
- Advertisement -

పర్యావరణ మిత్రులకు పిలుపు!!!!

- Advertisement -

ఒక్కో షాంపూ పాకెట్టులోని 7.5 మిల్లీ లీటర్ల షాంపూ చొప్పున, 8 కోట్ల స్నానాల వలన 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటవ్ర్ల షాంపూ నదిలో కలుపుతున్నాము. ఒక్కొక్కరూ 20v  గ్రాముల సబ్బు చొప్పున వాడడం వలన  16లక్షల కిలోల సబ్బు కృష్ణనది లో కలుస్తుంది.

దయచేసి పుష్కర స్నానాలలో షాంపూ, సబ్బులను వినియోగించకుండా యాత్రీకులకు నచ్చచెప్పండి. పుష్కర సమయంలో షాంపూ, సబ్బు వాడకం వలన మన పవిత్ర జలాలను మనమే నాశనం చేసుకుంటున్నామని తెలియచేయండి.

కృష్ణనది పుష్కరాలలో దాదాపు 12 కోట్ల మంది స్నానాలు చేస్తారని ఒక అంచనా. దీనిని బట్టీ లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజులలోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూ నదిలో కలుపుతున్నామో మీరే గమనించండి.

ఒక్కో షాంపూ పాకెట్టులో 7.5 మిల్లీ లీటర్ల చొప్పున షాంపూ ఉంటుంది. దీన్ని 8 కోట్ల స్నానాలు ( అంటే ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చేసే స్నానాలను సగటున తీసుకోవడం జరిగింది.) వలన 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుపుతున్నాము. హానికారకమైన రసాయనాలు ఎన్నింటిని మన చేతులతో నదిలో కలుపుతున్నామో ఒక్కసారి ఆలోచించండి.

ఒక్కొక్కరూ 20 గ్రాముల సబ్బు చొప్పున వాడడం వలన 8 కోట్ల మంది సబ్బు వాడితే 16లక్షల కిలోల సబ్బు కృష్ణనది లో కలుస్తుంది. దీనివలన నీరు ఎంతటి కలుషితం అవుతుందో మీరే గమనించండి.

ప్రభుత్వం దీనిని నియంత్రించడం కష్టమైందేమీ కాదు.

ఘాట్ లోకి తీర్ధయాత్రీకులను వదిలేటప్పుడే వారినుంచీ సబ్బు, షాంపూ పేకెట్లు సెక్యూరిటీ పాయింట్ వద్ద సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా లాగేసుకోవచ్చు. దీనికి పర్యావరణ మిత్రులు కూడా సహకరించి యాత్రీకులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని స్వచ్ఛంద కార్యకర్తలుగా చేయవచ్చు.

వీలైతే ఈ కింది నియమాలు పాటించండి.

1)మూడు సార్లు నదిలో నుంచీ మట్టిని తీసి ఒడ్డు మీద వేసి అప్పుడు స్నానం చేయాలి. నదులు చెరువులలో స్నానం చేసే ముందు ఈ విధంగా చేయడం వలన ప్రత్యేకంగా పూడిక తీత పనులు చేయాల్సిన అవసరం రాదు. ఇది ప్రాచీన రుషులు చెప్పిన స్నానవిధి.

2)నదీ స్నానం చేసేటప్పుడు ఆధునిక శుద్ధిపదార్థాలైన షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. మృత్తికా స్నానం చేయవచ్చు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా పుష్కర సమయంలో నిషేధమే.

3) పరిశుభ్రమైన మట్టి దొరికినప్పుడు దానిని ఒంటికి రాసుకుని చేయడం తప్పుకాదు. నేడు కోట్లాది మంది స్నానం చేస్తున్న పుష్కర ఘాట్ లలో ఈ రకమైన మట్టి దొరికే అవకాశం లేదు. కనుక భక్తితో మంత్ర సహిత స్నానం చేయడమే ఉత్తమం. ఆపోహిష్టామయో… అనే మంత్రం, సర్వనదీనామాలున్న శ్లోకాలు పఠిస్తూ స్నానం చేయాలి. పలుమార్లు మునకలు వేయాలి.

4) రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.

5) ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.

6) స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటంగాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.

7) అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.

8) పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.

9)ఆధునిక స్విమ్మింగ్ పూల్స్ లో ఏ విధమైన నియమ నిబంధనలున్నాయో అవే నిబంధనలు నదీస్నానాలలో మనవారు ఎప్పుడో విధించారని గుర్తుంచుకోండి.

శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు నెత్తికి చుట్టుకుంటాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -