Saturday, May 3, 2025
- Advertisement -

సత్యసాయిబాబా.. అలా చెప్పాడా!

- Advertisement -

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఒకింత ఆసక్తికరమైన.. వివాదాస్పదమైన ప్రకటన చేశారు. పుట్టపర్తి సత్యసాయి బాబాకు సంబంధించి ఆయన ఈ ప్రకటన చేశారు.

హిందుత్వవాదంతో కూడుకున్న ఈ ప్రకటన ఆశ్చర్యపరిచేదిలా ఉంది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే.. 2020 కళ్లా భారత దేశం హిందుత్వమయం అయిపోతుందని సత్యసాయి చెప్పారట. ఈ విషయాన్ని వీహెచ్ పీ అధ్యక్షుడు తాజాగా వెల్లడించారు. మరి ఇప్పటికే సత్యసాయి శివైక్యం అయి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇలాంటి నేపథ్యంలో సత్యసాయి గురించి వీహెచ్ పీ అధ్యక్షుడు ఇలా చెప్పడం విచిత్రమే. సత్యసాయి బాబా అయితే హిందూ ఆచారాలనే పాటించినా.. హిందుత్వవాదాన్ని ప్రచారం చేసినా.. కాషాయమే ధరించినా.. సర్వమత సమ్మేళనాన్ని ప్రబోధించారు. అన్ని మతాలూ సమానమే అనే భావననే వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా వీహెచ్ పీ అద్యక్షుడు మాత్రం సత్యసాయి దేశం హిందుత్వ మయం అవుతుందని వ్యాఖ్యానించాడని అంటున్నారు.

మరి 2020 అంటే అది ఎంతో దూరంలో లేదు. 2014 ఎన్నికలతో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హిందుత్వవాద ప్రభ మొదలైందన సింఘల్ మరో నాలుగేళ్లలోనే దేశం హిందుత్వమయం అయిపోతుందని అనడం విచిత్రంగా ఉంది. మరి దేశం హిందుత్వ మయం కావడం అంటే ఏమిటో కూడా సాధారణ జనాలకు అర్థం కావడం లేదు. అదెలా ఉంటుందో నాలుగేళ్లలో స్పష్టం అవుతుంది కదా. లెట్ వెయిల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -