Thursday, May 16, 2024
- Advertisement -

బాబు షాకింగ్ డెసిషన్…. జగన్ ప్రాణాలకు ముప్పు ఖాయమా?

- Advertisement -

ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రజల మధ్య నడక సాగిస్తున్న జగన్‌కి బాబు ప్రభుత్వం ఇస్తున్న సెక్యూరిటీ అరకొరే. అయితే ఇప్పుడు తాజాగా బాబు తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ పట్ల జగన్ ప్రాణాలకు ముప్పు ఉంటుందేమోనని జగన్ కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలే పాదయాత్ర……..అడుగు అడుగు ఎలా సాగేది మొత్తం ముందే తెలిసిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్‌ని టార్గెట్ చేయాలనుకునే శతృవులు బయట ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి?

ఇప్పుడు అదే పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజారెడ్డిని హత్యచేసిన రాగిపిండి సుధాకరరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం సత్ర్పవర్తన పేరు చెప్పి విడుదల చేసింది. ఆంద్రజ్యోతిలాంటి భజన పత్రికల్లో ఆల్రెడీ ఈ సుధాకరరెడ్డి ఉత్తముడు అనే తరహా వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం పరిణామాలు మాత్రం వైఎస్ కుటుంబసభ్యుల్లో, వైఎస్‌ల అభిమానులు, అనుచరుల్లో ఆందోళన పెంచుతున్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా బాలయ్య కాల్పుల కేసులో ప్రత్యర్థి అయినప్పటికీ చంద్రబాబు కోరిక మేరకు సాయం చేసిన మానవత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిదని…….ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఆ మేలు కూడా మర్చిపోయి ప్రతిపక్ష నేత జగన్‌ ప్రాణాలకు ముప్పుతెచ్చిపెట్టే నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఆల్రెడీ వైఎస్‌ది హత్యే అని, ఆ హత్య వెనకాల ఉన్న పేర్లుగా ప్రముఖులవే కొన్ని వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ విషయంలో అలాంటిది ఏమైనా జరుగుతుందేమో అని వైఎస్‌ల అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జగన్‌ని అన్ని వైపుల నుంచీ కార్నర్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ప్రాణాలకు కూడా హానితలపెట్టే అవకాశం ఉందా అన్న ఆందోళనలో జగన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి హత్యకేసులో శిక్షపడ్డ దోషిని ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు విడుదల చేయడం మాత్రం ఏ మాత్రం నైతికత అనిపించుకోదని పార్టీలకు సంబంధం లేని సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు కనీస స్థాయి విలువలు లేకుండా వ్యవహరించడం ఆయన జీవితానికే మచ్చలా మిగిలిపోవడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -