Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఆత్మ…. బాబు, బాలయ్యలపై పగబట్టిందా? శాంతిపూజలు చేయిస్తున్నారా?

- Advertisement -

ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబుపై పగబట్టిందా? వెన్నుపోటుతో తన రాజకీయ జీవితానికి, జీవితానికి ముగింపు పలికిన చంద్రబాబుపై ఎన్టీఆర్ ఆత్మ పగతీర్చుకోనుందా? ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కిస్తున్న బాలయ్యపై కూడా ఎన్టీఆర్ ఆత్మ కోపంగా ఉందా? 2019లో టిడిపిపై ఎన్టీఆర్ ఆత్మ పగతీర్చుకోనుందనే అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్న బాలయ్యపై కూడా ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందని……..అందుకే ఆ సినిమాకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అయితే ఈ మాటలు అంటున్నది ప్రతిపక్ష పార్టీ జనాలో, జనసేన, బిజెపి జనాలో కాదు. స్వయంగా టిడిపి జనాలే.

ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందన్న వార్తలు టిడిపిలోనే ఎక్కువ వినిపిస్తున్నాయి. శాంతి పూజలు కూడా ముఖ్యనేత కోసం చేయించబోతున్నారని టిడిపి నేతలు చెప్తున్నారు. ఈ మొత్తం విషయాలపై ఒక తెలుగు పత్రిక సవివరంగా వార్తను ప్రచురించింది. నలభై కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కష్టంలో ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. ఎన్నికలు ఇంకో ఏడాది ఉండగానే ఒంటరి అయ్యాడు. బిజెపి, జనసేన లాంటి రాజకీయ పార్టీలతో పాటు ఎస్సీఎస్టీలు, బీసీలు…..ఇంకా ఇతర కులాల ప్రజలు కూడా ఇప్పుడు టిడిపికి దూరమవుతూ ఉన్నారు. ఇతర ప్రజలు కూడా టిడిపికి ఓటెయ్యం అని బాబు మొహం మీదే చెప్పేస్తున్నారు. ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు కూడా అన్నీ అడ్డంకులే. అందుకే ఎన్టీఆర్ ఆత్మ పగబట్టిందేమో అన్న అనుమానాలు టిడిపి ముఖ్యనేత ఇంట వినిపిస్తున్నాయి. ఇందుకోసం త్వరలోనే శాంతి పూజలు కూడా చేయించనున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -