Sunday, June 16, 2024
- Advertisement -

నాగబాబుది ఓవర్ కాన్ఫిడెంటేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల రిజల్ట్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారం తమదంటే తమదని ఇటు అధికార వైసీపీ, అటు విపక్ష కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. ఇక కూటమిలోని జనసేన నాయకులు మరి అతి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని, పవన్ సీఎం అవుతారనే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక మరికొంతమందైతే కేంద్రమంత్రి అవుతారని చెప్పుకొస్తున్నారు.

21 మంది ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీకి రావడం ఖాయమని పవన్ సోదరుడు నాగబాబు చెప్పడం వినడానికి బాగానే ఉన్నా ప్రాక్టికల్‌గా రిజల్ట్‌ ఎలా వస్తుంది అన్నదానిపై మాత్రం సందేహం నెలకొంది. ఇక పవన్ 17 ఏళ్ల కష్టానికి ఈసారి ప్రతిఫలం పిఠాపురంలో దక్కుతుందని నాగబాబు నమ్మకంగా ఉండగా వైసీపీ అభ్యర్థి వంగా గీత మాత్రం గట్టిపోటీనే ఇచ్చారు.

ఎగ్జిట్ పోల్స్ సైతం పిఠాపురంలో టఫ్ పోటీ ఉందని వెల్లడించగా జనసేన నాయకులు ఏ ధీమాతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పోటీ చేసిన 21 స్థానాలకు గానూ 21 గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదమని కొంతమంది అభిప్రాయపడుతుండగా జూన్ 4తో ప్రజలు ఎవరివైపు నిలిచారో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -