- Advertisement -

ఆమె మెడ అలంకరణకు కాదు.. ఆత్మరక్షణకు

- Advertisement -

భారతీయులకు మెడలో గొలుసులు, హారాలు లాంటి నగలను అలంకరించుకోవడం ఓ సాంప్రదాయం. దీనికి తోడు ఎవరికైన మెడ పొడవుగా ఉంది అంటే వారు చూడటానికి కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తారు. దీంతో మెడలో వేసుకునే నగలను బట్టి ఆ మగువలకు మరింత అందం వచ్చి పడుతుంటుంది. అందుకోసమని చెప్పి ఎవరూ మెడలను పొడవు చేసుకోలేరు కదా. కానీ థాయిలాండ్‌ లోని కరెన్‌ అనే తెగలోని కయాన్‌ అనే ఒక ఉప తెగ మాత్రం వారి మెడలు పొడవు కనిపించడం కోసం చిన్నతనం నుంచే వింత ఆభరణాలను ధరించి ప్రపంచ చూపును వారి వైపు తిప్పుకుంటున్నారు.

అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలిస్తే…ఆశ్చర్యం మేస్తుంది. మయన్మార్‌ నుంచి.. ఒకప్పుడు మయన్మార్‌ పరిసర ప్రాంతాల్లో నివసించిన కయాన్‌ తెగకు చెందిన 40,000 మంది 1990లలో వారి దేశంలో అంతర్యుద్ధం ప్రబలడంతో థాయిలాండ్‌ సరిహద్దు ప్రాంతాల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. కయాన్‌ ప్రజల జీవనాధారం వ్యవసాయం. మహిళలు ఇంటి వద్దే చేతి వృత్తులు చేసి జీవిస్తారు. ఈ తెగ సంప్రదాయం ప్రకారం మహిళల మెడలు పొడవుగా కనిపించాలి. అందుకు వారి చిన్నతనం నుంచే మెడ చుట్టూ బంగారు, ఇత్తడి వలయాలు ధరిస్తారు. అయిదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటగా ఒక బంగారపు ఆభరణాన్నిధరింపజేస్తారు. అలా ఏడాదికి ఒకటి చొప్పున ఆభరణాలు పెరుగుతూనే ఉంటాయి. వీరు ఏడాది మొత్తంలో కేవలం మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే వాటిని తీసే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం మహిళలు మాత్రమే హాజరయ్యే కొన్ని పర్వదినాలు ఉంటాయి. అప్పుడు మాత్రమే వాటిని తీసే వీలుంటుంది. అయితే ఈ మెడ స్టోరీ వెనుక మరో సంఘటన ఉందని అక్కడి పాత తరం వారు చెబుతారు. అదేంటంటే…వీరి మెడకు ఇలా ఇత్తడి నగిషీలు ఉండడం వలన వీరు పర్వత ప్రాంతాలలో నివశించడం వలన పులులు వీరి పై దాడి చేసినప్పుడు వీరి మెడ ఆ క్రూరమృగాల నోటికి దొరక్కుండా ఉంటుంది. దీంతో వీరు కాసేపు ఆ మృగాలతో ఫైట్ చేయడం వీలౌతుంది. ఈ లోపు గట్టిగా అరవడం వలన సమీపంలోని వారు వచ్చి పులులను తరిమి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది.

ఇక కయాన్‌ తెగ మహిళల మెడలు పొడవుగా ఉన్నట్లు కనిపించినా మెడకు ధరించిన భారీ లోహపు రింగుల వల్ల ఆ తెగ స్త్రీల భుజాలు, పక్కటెముకలను పట్టి ఉంటాయి. అందుకే వారి మెడలు చాలా పొడవు ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రింగును చేర్చుతూ ఉండటం వల్ల వారి మెడలు మరింత పొడవుగా అనిపిస్తాయి.. ఇప్పుడిప్పుడే ఈ తెగలోని యువతులు ఈ వలయాల నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ జాతి మహిళలు అద్భుతమైన నేత పనివారు. వారి ప్రధాన జీవనాదాయం ఇదే. కయాన్‌ పొడవు మెడ సంప్రదాయాన్ని కన్‌ ఖ్వాన్‌ అని పిలుస్తారు. ఇది మంగోలియా నుంచి వలస వచ్చిన ఒక తెగ నుంచి ఆచరిస్తున్న సంప్రదాయం. రాతి యుగం నుంచి ఈ విధానం కొనసాగిస్తున్నారు. కయాన్‌ ప్రజలు ఆడ డ్రాగన్‌కి, పురుషునికి కలిగిన సంతానంగా విశ్వసిస్తారు. కే హేటీన్‌ బో అనేది కయాన్‌ల ముఖ్య పండుగ. దీనిని ప్రతి సంవత్సరం మార్చి చివరిలో కానీ ఏప్రిల్‌ మొదటిలో కానీ జరుపుకొంటారు.కయాన్‌ వంటి పొడవు మెడ ఉన్న కొండ తెగలు కేవలం ఉత్తర థాయిలాండ్‌లోని చియాంగ్‌ మాయ్‌, చియాంగ్‌ రాయ్‌ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -