Monday, April 29, 2024
- Advertisement -

ఢీ అంటే ఢీ… స‌ఫారీల‌తో స‌మ‌రానికి సిద్ద‌మైన భార‌త్‌….

- Advertisement -

కొత్త ఏడాది ఆరంభంలోనే కోహ్లి సారథ్యంలోని భారత జట్టుకి కఠిన సవాల్ ఎదురుకానుంది. స‌ఫారీ జ‌ట్టును ఢీకొట్టేందుకు టీమిండియా సిద్ద‌మ‌య్యింది. 2017 సంత్స‌రంలో టీమిండియా విజ‌య‌ప‌థంలో దూసుకుపోయింది. ఇప్పుడు ఖ‌టిన‌మైన ప‌రీక్ష కానుంది.

పేస్ పిచ్‌లకి స్వర్గధామంగా పేరొందిన దక్షిణాఫ్రికాలో.. టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌ని శుక్రవారం (జనవరి 5) నుంచి ఆడనుంది. గత ఏడాది ఆడిన అన్ని టెస్టు సిరీస్‌ల్లోనూ గెలిచి జైత్రయాత్ర సాగించిన భారత జట్టు అదే జోరుని సఫారీ గడ్డపై కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

మరోవైపు దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు భారత్ చేతిలో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌లో ఓడిపోలేదు. ఈ రికార్డుని కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్

తొలి టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (కేప్‌ టౌన్ వేదికగా)
రెండో టెస్టు : జనవరి 12 నుంచి 17 వరకు (సెంచూరియన్)
మూడో టెస్టు: జనవరి 24 నుంచి 28 వరకు (జొహనెస్‌బర్గ్)

వన్డే సిరీస్
తొలి వన్డే : ఫిబ్రవరి 1న (డర్బన్)
రెండో వన్డే : ఫిబ్రవరి 4న (సెంచూరియన్)
మూడో వన్డే : ఫిబ్రవరి 7న (కేప్ టౌన్)
నాలుగోవన్డే: ఫిబ్రవరి 10న (జొహనెస్‌బర్గ్)
ఐదో వన్డే : ఫిబ్రవరి 13న (పోర్ట్ ఎలిజిబెత్)
ఆరో వన్డే : ఫిబ్రవరి 16న (సెంచూరియన్)

టీ20 సిరీస్
తొలి టీ20 : ఫిబ్రవరి 18న (జొహనెస్‌బర్గ్)
రెండోటీ20 : ఫిబ్రవరి 21న (సెంచూరియన్)
మూడోటీ20: ఫిబ్రవరి 24న (కేప్‌ టౌన్)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -