ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాయామం, యోగా, క్రమం తప్పకుండా ఆహారం తీసుకునే వారు అధికమవుతున్నారు. అయితే కొత్త పరిశోధన ప్రకారం, అధిక కొవ్వు (హై-ఫ్యాట్) కలిగిన కీటో డైట్ అధిక రక్తంలో చక్కెర (హై బ్లడ్ షుగర్) ఉన్నవారిలో వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను మెరుగ్గా ఉపయోగించగలదు. ఇది ఆరోగ్యానికి మరియు దీర్ఘాయుషుక్ ముఖ్యమైన సూచికగా భావిస్తారు. వ్యాయామం బరువు తగ్గడంలో, కండరాలను బలపరచడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నవారిలో ఈ ప్రయోజనాలు పూర్తిగా కనిపించకపోవచ్చు. అధిక గ్లూకోజ్ స్థాయిలు వ్యాయామ సమయంలో శరీరం ఆక్సిజన్‌ను వినియోగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు కీటోజెనిక్ డైట్ ప్రభావాన్ని పరిశీలించారు. కీటో డైట్ అంటే అధిక కొవ్వు, చాలా తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార విధానం. ఈ డైట్ వల్ల శరీరం గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వును ఇంధనంగా ఉపయోగించే కీటోసిస్ అనే స్థితిలోకి వెళుతుంది.
అధ్యయనంలో అధిక రక్త చక్కెర ఉన్న ఎలుకలకు కీటో డైట్ ఇచ్చారు. కేవలం ఒక వారం రోజుల్లోనే వాటి రక్త చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదనంగా, వాటి కండరాలు వ్యాయామానికి మరింతగా స్పందించాయి. క్రమంగా వాటి కండరాల్లో స్లో-ట్విచ్ మసిల్ ఫైబర్స్ పెరిగి, ఎక్కువ సేపు శక్తితో పని చేసే సామర్థ్యం పెరిగింది. టో డైట్ మరియు వ్యాయామం కలిపి చేస్తే శరీరంలోని మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
