Friday, May 10, 2024
- Advertisement -

లిక్కర్ బాటిల్ వెడ్డింగ్ ఇన్విటేషన్

- Advertisement -

మెజారిటీ వెడ్డింగ్ ఇన్విటేషన్లు మాములుగానే ఉంటాయి. ఎందుకంటే వాటి మ్యాటర్లో… టేస్ట్ లు చూపించేది మధ్యతరగతి వారే కాబట్టి కాస్త్ లిమిట్స్ లో ఉంటారు. కాని వీటి విషయంలో అప్పుడప్పుడూ కొందరు బడా బాబులంటూ మనకు తగులుతూ ఉంటారు. వారు తమ పిల్లల వివాహానికి తయారుచేయించే వెడ్డింగ్ కార్డును చాలా కాస్ట్లీగా తయారు చేస్తూ ఉంటారు.

ఆ మధ్య గాలి జనార్దన్ రెడ్డి, రీసెంట్ గా ఎన్టీవీ నరేంద్ర చౌదరిలు మనకు గుర్తుకు వస్తారు. నరేంద్ర చౌదరి అయితే వెడ్డింగ్ కార్డ్ కు లక్ష, లక్షన్నర ఖర్చు పెట్టి మరీ చేయించాడు. ఇదిగో ఇప్పుడు మీరు చూసే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూడండి. దీనికి అంత పెద్దగా ఖర్చు అయ్యేది ఉండదు. కాని క్రియేటివిటీ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. అశోక్- సరయు అనే వధూవరులకోసం ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇలా తయారు చేయించారు. నవంబర్ రెండవ తారీఖున గురువాయూర్ టెంపుల్ లో ఉదయం పదకొండున్నర గంటలకు వీళ్ల మ్యారేజ్ జరుగుతున్నట్లు, అదే మాదిరిగా నాలుగున సరస్వతి ఆలయంలో సాయంత్రం మూడుగంటల నుంచి రిసెప్షన్ ఆ తదంతరం… విందు వుంటుందని ఎంతో చక్కగా పద్దతిగా నిషాసీసా పై ముద్రించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ లిక్కర్ బాటిల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ను అబ్బాయిలు అబ్బాయిలకే ఇస్తున్నారట. సదరు తీసుకున్న ఓ వ్యక్తి దీనిని ఎంచక్కా ఫొటో తీసి నెట్లో పెట్టి ఇల ఆవైరల్ అయ్యేలా చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -