మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం కి నరేంద్ర మోడీ సర్కారు తీవ్ర అవమానం చేసింది అని కోడై కూస్తోంది నేషనల్ మీడియా. మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మీద తప్పుడు వ్యాఖ్యలు చేసి ఆయన గురించి కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రికి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం జీ ఉన్నప్పటి ఇంటినే ఇచ్చేసింది. ఆయన రాష్ట్రపతిగా గడిపిన ఇంటిని స్మృతి చిహ్నంగా మార్చి దేశానికి అంకితం చేయాలన్న మేధావుల, అభిమానుల విజ్ఞప్తులను తుంగలో తొక్కింది. కలాం ఏ విదేశంలోనో పుట్టి ఉంటే గొప్పగా గౌరవించేవారు.
కలాం రాష్ట్రపతిగా నివాసం ఉన్న రాజాజీ మార్గ్‌లోని 10 నెంబరు ఇంటిని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కి ఈ ఇల్లు ఇవ్వడం పట్ల పలువురు సీరియస్ గా ఉన్నారు. రాష్ట్రపతిగా దేశానికే అత్యునత పదవి చేపట్టిన కలాం అప్పటి నుంచీ చనిపోయేవరకూ అక్కడే నివసించారు. కలాంని రెండు రకాల అవమానాలు జరిగాయి. ఒకటి ఆయన నివసించిన అంత గొప్ప ఇల్లు ని భావి తరాలు గుర్తుంచుకునే విధంగా స్మృతి చిహ్నంగా మార్చాలి అని చాలా మంది మేధావులు కోరిన విజ్ఞప్తి ని ప్రభుత్వ పక్కకి నెట్టేసి, మరొక పక్క రెండో తప్పిదంగా ముస్లింలపై, ప్రత్యేకించి కలాంపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచిన మంత్రి మహేష్ శర్మకు ఈ ఇంటిని కేటాయించింది. ” కలాం గొప్ప వ్యక్తే కావచ్చు, జాతీయవాది కావచ్చు , మానవతా వాది కావచ్చు కానీ ఆయన ఒక ముస్లిం అని మరచిపోకండి” అంటూ అయన అప్పట్లో వ్యాఖ్యానించారు.
కలాం ఇంటిని స్మృతి చిహ్నంగా మార్చాలి అన్న డిమాండ్ మహేష్ దగ్గర రైజ్ చేసినప్పుడు అంతగా అవసరం ఏమీ లేదు అన్నట్టు ఆయన మాట్లాడిన అయిష్ట ధోరణి ఎవ్వరికీ నచ్చడం లేదు. కలాం ఇక్కడ ఉన్న సమయం లో అనేక మొక్కలని తెప్పించేవారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఎనభై చైనీస్ బత్తాయి మొక్కలు, నిమ్మ మొక్కలు తెప్పించి నాటారు కలాం ఇప్పటికీ అవి చక్కగా అక్కడ ఉన్నాయి.