Monday, April 29, 2024
- Advertisement -

ఇక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయని మీకు తెలుసా?

- Advertisement -
Money from Trees at Woodlands, England

డబ్బులు చెట్లకు కాయడమేంటి అని ఆశ్యర్యపోతున్నారు కదూ. నిజమే ఇంగ్లండ్ లోని వుడ్ ల్యాండ్ అనేప్రాంతంలో నిజంగానే చెట్లల్లో  డబ్బులు దర్శనమిస్తాయి.   అయితే అవి కాయలు, పువ్వులు లాగే కాసినవి కావు.

కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు డబ్బులను ఇలా చెట్ల కాండాలకు గుచ్చేవారట. ఆ చెట్లపై దేవతలు నివసిస్తారని, ఇలా నాణాలను చెట్లపై ఉంచితే దేవతలు తమ కోరికలను తీరుస్తారని వారు నమ్మేవారట. ఇప్పటికీ ఈ ఆచారాన్ని అక్కడ చాలామంది పాటిస్తున్నారట. ముఖ్యంగా క్రిస్ మస్ రోజు ఇలా చెట్లకు డబ్బులు గుచ్చేవారు ఎక్కువగా ఇక్కడకి వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలోని ప్రతి  చెట్టు డబ్బులతో  దర్శనమిస్తుంటుంది. ఈ ట్రీలను  మనీ ట్రీలుగా పిలుస్తుంటారు.  ఏమైనా కొత్తవారికి  వాటిల్ని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాస్తున్నాయని అనిపిస్తుంది కదండీ. 

{youtube}m481uO7fMlU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -