దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎదుర్కొంటున్న తరుణంలో రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజలు ఎప్పుడూ ఎలాంటి వార్తలను వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళనలో బతుకుతున్నారు. మరి కొందరు ఈ భయంకరమైన పరిస్థితుల గురించి తెలియగానే మరణిస్తున్నారు.
ఈ భయంకరమైన పరిస్థితులలో ప్రజలలో ధైర్యం నింపడానికి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇటువంటి సమయంలోనే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోమని సలహా ఇస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఓ పోస్టు పెట్టారు.

Also read:ఈ హీరోయిన్లను పరిచయం చేసింది పూరీ జగన్నాదే?
ప్రస్తుతం మన చుట్టూ ఎంతో భయంకరమైన దుర్భర పరిస్థితిలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నా మొహంలో చిరునవ్వు తెప్పించిన ఫోటో ఇది అంటూ తన కూతురు సితార చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ ఈ ఫోటోకు మెమోరీ థెరపీ అనే హాష్‌ట్యాక్‌ని జతచేసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక సితార ఫోటో చూసిన మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సితార ఎంతో క్యూట్ గా ఉందని మరిసిపోతున్నారు.
Also read:రజినీకాంత్ మోహన్ బాబు ఫోటోపై మంచు లక్ష్మి హాట్ కామెంట్?