Friday, March 29, 2024
- Advertisement -

రజినీకాంత్ మోహన్ బాబు ఫోటోపై మంచు లక్ష్మి హాట్ కామెంట్?

- Advertisement -

టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టి మంచు ల‌క్ష్మి నటిగానే కాకుండా యాంకర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండింగ్ విషయాలపై విభిన్నంగా స్పందిస్తూ, వివాదాస్పద కామెంట్స్ తో పోస్ట్ పెట్టడం ఈమె స్టైల్. అది కాంట్రవర్సి అయినా మంచి విషయం అయినా సరే. ఒక్కోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది, విమర్శనాత్మక ట్రోల్స్ ఎన్ని వచ్చినా కూడా ఆమె స్టైల్ వాటికి సమాధానం చెప్తుంటారు.

తాజాగా ఈమె మోహన్ బాబు, రజినీకాంత్ కలిసి దిగిన ఫోటో పై కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళితే మోహన్ బాబు,రజినీకాంత్ ఎప్పటి నుంచో మంచి మిత్రులు.ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె సినిమా షూటింగ్ కోసం హైద్రాబాద్‌కు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. రజినీకాంత్ హైదరాబాదులో ఉన్న సమయంలో తన మిత్రుడైన మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్టున్నారు. ఆ సమయంలో దిగిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Also read:ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్.. చిరంజీవి షాకింగ్ నిర్ణయం?

వాటిపై మంచు లక్ష్మీ కామెంట్ చేస్తూ స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని ఈ విధంగా వివరించారు. ఆ స్టార్స్ ఇద్దరు అలా వాకింగ్ చేస్తూ వెళ్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటేసింది వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. అయితే స్నేహబంధంలోని స్వచ్చత అంటే ఇదే అని నాకు తెలిసింది. వీరిద్దరి స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను . ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also read:రికార్డు బద్దలుకొట్టిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -