ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికె అనేకమంది ప్రముఖులు అవార్డులపై స్పందించారు. ఇప్పుడు తాజాగా ఐటి మంత్రి లోకేష్ బాబు ఈ వివాదంపై అమోఘంగా స్పందించారు. నంది అవార్డుకు-ఆధార్‌కు లింక్ పెట్టారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలకు, బ్యాంక్ అకౌంట్లకు, సిమ్ కార్డులకు ఆధార్ తప్పని సరిచేసింది. కాని ఇకపై ప్రశ్నించడానికి కూడా ఆధార్ వుండాలి అంటూ చినబాబు సెలవిచ్చారు. ఇది నారావారి రాజ్యంగం అని చెప్పుకోవచ్చు. అసలు నంది అవార్డుకు, ఆధార్‌కు లింకేమైనా ఉందా..?
బ్యాంక్ అకౌంట్‌కి, సిమ్ కార్డులకు, ఇతర ప్రభుత్వ పథకాలను ఆధార్ ఉండాల్సిందే. ఇకపై ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటె ఆధార్ కార్డు ఉండాలంట..ఇది లోకేష్ గారి మాట. అసెంబ్లీలో లోకేష్ నంది అవార్డులపై గొప్పగా సలవిచ్చారు. నంది అవార్డుల గురించి ప్రశ్నిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ లేదట. కనీసం, ఓటు హక్కు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేనివారే నంది అవార్డుల్ని ప్రశ్నిస్తున్నారంటూ నారా లోకేష్ అసహనం వ్యక్తం చేసేశారండోయ్. ఇప్పటికె ఎన్నో సార్లు తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్న మంత్రిగారు ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనె తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు.
విభజన తర్వాత హైదరాబాద్‌నుంచి కార్యకలాపాలు సాగించిన చినబాబు ఆంధ్రా-ఆధార్ అంటూ సినీ పరిశ్రమను అవమానించడాన్ని ఏమనుకోవాలి. నంది అవార్డులపై కొంత అసహనం ఉన్నది నిజం. అసలు ఎక్కడ తప్పు జరిగింది అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ పరువు పోయోది చంద్రబాబు ప్రభుత్వానిది. అసలు ఆంధ్రాలో లోకేష్‌కు ఆధార్ కార్డు ఉందా…? హైదరాబాద్‌లో సొంతిల్లులు కట్టుకొని ఇతరులను విమర్శించడం లోకేష్‌కు సిగ్గుచేటు.
గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటికి లీడింగ్‌లో వున్న డోనాల్డ్ ట్రంప్‌ని ప్రశ్నించేశారు..: అంటె అమెరికాలో బాబుకు ఆధార్ కార్డు ఉందా…? అసలే సోషియల్ మీడియాలో చినబాబును, పెద బాబును ఉతికి ఆరేస్తుంటె దాన్ని తట్టుకోలేక ఆసహనంతో మిడి మిడి జ్ణానంతో మాట్లాడి ఇంకా తమ పరువును మరో సారి తీసుకున్నారు.
లోకేష్ మాటలు బాగానె ఉన్నా హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి, ఫామౌస్ మేయింటెన్స్ ఖర్చులకు ప్రజలు సొమ్మును ఖర్చు పెడుతున్నారు. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వేరె రాష్ట్రంలో ఉన్న సొంత ఖర్చులకు ఏపీ ఖజానానుంచి ఖర్చుపెట్టడంపై లోకేష్ స్పందిస్తే బాగుంటుంది. ఇక నుంచి ప్రతిభ అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటె చాలు నంది అవార్డు వారి సొంతం.
అవక అవక అసెంబ్లీలో స్పందిచిన లోకేష్ బాబు.. లింకులేకుండా భలే స్పందించారు. జగన్ అసెంబ్లీలో ఉండుంటె దాని కథే వేరప్పా…?