Friday, May 3, 2024
- Advertisement -

మహిళలు, పురుషులను వెంటాడే నీడలు

- Advertisement -

భయం. ఇది కొద్దోగొప్పో అందరికి ఉంటుంది. దేనికి భయపడ్డా.. పడకపోయినా మరణానికి మాత్రం అందరూ భయపడుతూనే ఉంటారు. అయితే ఇది కాకుండా ప్రపంచంలోస్త్రీ, పురుషులను భయపెట్టే అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నాయి కొన్ని సర్వేలు. ముఖ్యంగా ఆడవారు తమ గ్లామర్ తగ్గిపోతోందంటే తట్టుకోలేరట.

అద్దం ముందు కూర్చుని గంటల తరబడి తమ అందాన్ని తీర్చిదిద్దుకోవడంలోనే గడుపుతారట. ఇక మహిళలను భయపెట్టే ఐదు అంశాలు ఏమిటంటే ముందు జుట్టు నెరవడం. రెండోది చర్మం ముడతలు పడడం. ఈ రెండింటి తర్వాత వారు ఇబ్బంది పడేది కళ్ల కింద వచ్చే ముడతలకి. నారీమణులను భయపెట్టే నాలుగో భయం డబుల్ చిన్. చిట్టచివరి భయం బింగో వింగ్స్. అంటే లావుగా మారే చేతులన్నమాట. ఈ ఐదు భయాలు మహిళలను విపరీతంగా వేధిస్తాయని సర్వేలో తేలింది. వీరి తర్వాత పురుషులను భయపెట్టే అంశాలు కూడా ఐదు ఉన్నాయి.

వాటిలో మొదటిది మ్యాన్ బూబ్స్. అంటే పురుషులకు వక్షోజాలు రావడం. ఆ తర్వాత భయం పలుచబడే జుట్టు. మహిళలకు నాలుగో భయం పురుషుల విషయానికి వస్తే మూడో భయంగా మారింది. అదే డబుల్ చిన్. ఇక నాలుగో భయం భారీ పొట్ట. పురుషులను వేధించే ఐదో భయం వారి జట్టు రంగు మారడమట. ఇన్ని భయాలతో స్త్రీ. పురుషులు నిత్యం సావాసం చేస్తుంటారని సర్వేలు చెబుతున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -