- Advertisement -
వ్యాయామం చేయటం వలన కొవ్వును కరిగించే హార్మోన్స్ స్థాయి పెరుగుతుందని పరిశోదకులు అంటున్నారు.
అయితే కొవ్వును కరిగించేందుకు హార్మోన్ ఉంటుందా అనే సందేహం కొంత కాలం వరకు పరిశోదకులకు ఉండేది. తాజా పరిశోదనల ప్రకారం అటువంటి హార్మోన్ ఒకటి ఉందని తెలిసింది.
దానినే ఇరిసిన్ హార్మోన్ అని అంటారు. రక్తంలో దాని ఉనికిని కనుగొనే విధానాన్ని కనుగొన్నారు. వ్యాయామం చేసినప్పుడు రక్తంలో ఇరిసిన్ హార్మోన్ స్థాయి పెరగటం వలన మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాక ఇది రక్తంలో చక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.
అందుకే పరిశోదకులు వ్యాయామం చేయటం ఎంతో అవసరమని చెప్పుతూ ఉంటారు. అలాగే చెడు కొలస్ట్రాల్ కూడా తగ్గుతుందని చెప్పుతున్నారు. కాబట్టి వ్యాయామం చేసి ఈ హార్మోన్ స్థాయిని పెంచుకొని ఊబకాయానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు పరిశోదకులు.