Wednesday, April 24, 2024
- Advertisement -

ఈ చిన్న తప్పుల వల్లే పెద్ద పొట్ట వస్తుంది.. తెలుసా?

- Advertisement -

సాధారణంగా అతిగా తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే.అయితే కేవలం తిండి తినడం మాత్రమే కాకుండా కొన్ని తప్పులను చేయటం వల్ల కూడా మన శరీర బరువు పెరిగి ఊబకానికి దారి తీస్తుంది. అయితే ముందుగా శరీర బరువు పెరగడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

*సాధారణంగా ఎవరికైతే జీర్ణక్రియ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయో అలాంటివారు అధిక శరీర బరువు పెరుగుతారు. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక ఆహారం మొత్తం కొవ్వు రూపంలో నిల్వ ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కనుక జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి.

*మహిళలు లేదా పురుషులలో కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ విధంగా ఊబకాయానికి దారితీస్తుంది.

Also read:కియారా అద్వానీకి ట్రిపుల్ ధమాకా..?

*చాలామంది ఎక్కువసేపు కూర్చుని పని చేయటం వల్ల అధిక శరీర బరువు పెరుగుతారు. వీరి దృష్టి మొత్తం పనిపై ఉండటం వల్ల వీరు శారీరక వ్యాయామం గురించి ఆలోచించరు. ఈ క్రమంలోనే నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తుంది.

*సాధారణంగా కొందరు భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో ఎక్కువగా నీటిని తాగుతారు. ఇలా నీటిని తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక, మన పొట్టలోని కొవ్వు పేరుకుపోవడంతో అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది.

Also read:హీరో రామ్ కొత్త స్టోరీ.. వినకుండానే ఒకే చేసాడట!

*సాధారణంగా కొందరు వ్యక్తులు పనిలో నిమగ్నమయి కొన్నిసార్లు భోజనం చేయడం మానేస్తుంటారు. ఈ విధంగా భోజనం చేస్తూ మానేయటం వల్ల అధిక శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది.

*చాలా మంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులను ఉపయోగించేవారిలో కూడా ఈ విధంగా శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. ఈ విధంగా కేవలం అధికంగా భోజనం చేయడం మాత్రమే కాకుండా, పై తెలిపిన కారణాలవల్ల కూడా అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -