Sunday, May 5, 2024
- Advertisement -

బూతు పత్రిక అన్న ఆరోపణలను భలేగా నిరూపించుకున్న ఆంధ్రజ్యోతి

- Advertisement -

తనకు కులమే లేదు. కుల ఫీలింగ్ అంటనే నేను ఆమడదూరంలో ఉంటా, సమాజంలో కులం కుళ్ళును కడిగేయాలన్న ఆశయంతో పనిచేస్తూ ఉంటా అంటూ వీరావేశం ప్రదర్శిస్తూ వీకెండ్ కామెంట్ రాసి గట్టిగా రెండు రోజులు గడిచిందో లేదో ఆంధ్రజ్యోతి వారు తమ అసలు బుద్ధిని బయటపెట్టుకున్నారు. ఒక కులం వాళ్ళు జగన్‌కి సపోర్ట్ చేేస్తున్నారని చెప్పి రాధాకృష్ణ ఆ కులం జనాలను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తను కొమ్ము కాసే జనాలు, ఆ జనాలు బలంగా ఉండే విజయవాడలో సంఘటనల గురించి ఒకలా, పులివెందల నుంచీ మొదలుపెట్టి రాయలసీమలో జరిగే సంఘటనల గురించి మరోలా రాయడం ఎప్పటినుంచే వీళ్ళకు అలవాటే. చిన్న క్రైమ్ సంఘటన జరిగినా రాయలసీమలో అంటూ బాగా హైలైట్ చేస్తారు. అదే విజయవాడ-గుంటూరుకు వచ్చేసరికి ఏ ప్రాంతమో తెలియనట్టుగా వార్తలు ఉంటాయి. ఆ విషయం పక్కనపెడితే తెలుగు నటుడు విజయసాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన భార్య పేరు వనితారెడ్డి.

ఆ పేరు వెనకాల రెండక్షరాలు జ్యోతివారి అసలు సిసలు జర్నలిజం బయటకొచ్చేలా చేశాయి. ఇక వనిత ఫొటోల నుంచి ఒక ప్రత్యేకమైన ఫోటో తీసుకుని ఆ ఫొటోతో న్యూస్ పోస్ట్ చేసి బూతు పత్రిక అంటూ ఉన్న ఆరోపణలను భలేగా నిరూపించుకున్నారు. ఒక కులంవాళ్ళు జగన్‌కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆ కులాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలా? జగన్ రాక్షసుడు అని రాసుకోవడం వరకూ రాజకీయంగా తీసుకోవచ్చు. కానీ జగన్‌కి ఎక్కువ సంఖ్యలో మద్ధతిస్తున్నారని చెప్పి ఒక కులం మొత్తంపైన విషం కక్కడం మాత్రం మానవత్వం అనిపించుకోదు. ఇదే సందర్భంలో విజయసాయి భార్య ఫొటోను సెలక్ట్ చేయడంలో తమ బుద్ధిని పోనిచ్చుకోలేదు జ్యోతి వారు. వేరే ఏ ఫొటో దొరకనట్టుగా …..ఆత్మహత్యకు సంబంధించిన వార్తల్లో కూడా ఇలాంటి ఫొటోతో న్యూస్ ప్రచురించొచ్చు అని జ్యోతివారికి మాత్రమే ఎందుకు అనిపిస్తుందో వాళ్ళే చెప్పాలి? మానవత్వం, మనుషులు, అభివృద్ధి, మంచితనం అంటూ నీతులు మాత్రం బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు. ఆ నీతుల వెనక అసలు బండారం మాత్రం ఇలా ఉంటుంది. ఇక్కడ విజయవాడను, మరో కులాన్ని తక్కువ చేయాలన్న ఉద్ధేశ్యం మాకు లేదు. ఉదాహరణ కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్టుగా వార్తలు ప్రచురిస్తున్నారంటే……ఆత్మహత్య వార్తలను కూడా ఇలా ప్రచురిస్తున్నారంటే అలాంటి జనాలు ఇంకెవరినో ఉద్ధరిస్తారని కూడా ఏం చెప్తాం. అవసరాలు ఉన్నంత వరకే ఏమైనా చేస్తారు అని చె్ప్పొచ్చేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -