Sunday, May 19, 2024
- Advertisement -

బుమ్రా వేసిన బాలే ఇండియా ఓట‌మికి కార‌ణ‌మా…?

- Advertisement -

ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌, శ్రీలంతో జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఘోరంగా ఓట‌మిపాల‌య్యింది. భార‌త్ బ్యాట్స్‌మేన్ లంద‌రూ లంక‌బైల‌ర్ల‌ముందు త‌లొంచారు. ధోనీ మాత్రం గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేసి ఇండియా ప‌రువు నిలిపాడు. భార‌త్ ఓట‌మికి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నోబాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసిందని లంక కోచ్ నికో పోథస్ అభిప్రాయపడ్డాడు లంక కోచ్ నికో పోథస్ అభిప్రాయ‌ప‌డ్డారు.

మొద‌టి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 112 పరుగులకు ఆలౌటవగా.. అనంతరం ఛేదన ఆరంభంలోనే శ్రీలంక 7/1తో కష్టాల్లో నిలిచింది. ఈ దశలోనే ఉపుల్ తరంగ వికెట్‌ని బుమ్రా తీసినా.. రిప్లైలో అది నోబాల్‌గా తేలడంతో అతనికి జీవనదానం లభించింది. చివరికి తరంగ (49: 46 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌తో శ్రీలంక ఛేదనని 20.4 ఓవర్లలోనే పూర్తి చేయగలిగింది.

ధర్మశాల వన్డేలో రెండు అంశాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఒకటి శ్రీలంక టాస్ గెలవడం.. రెండు నోబాల్‌ కారణంగా ఉపుల్ తరంగకి జీవనదానం లభించడం. తొలి వికెట్‌ కోల్పోయిన కొద్ది నిమిషాల్లోనే మరో వికెట్ పడుంటే కచ్చితంగా లంక ఒత్తిడిలో పడేద‌న్నారు. తర్వాత వికెట్ (తిరుమానె) 19 పరుగుల వద్దే పడింది. ఉపుల్ తరంగ బంతి నోబాల్‌గా కాకుండా ఉండి ఉంటే.. 19/3 నుంచి జట్టు కోలుకోవడం కష్టమయ్యేది’ అని కోచ్ గుర్తు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -